QR Code Scam: క్యూఆర్ కోడ్లతో కొత్త స్కామ్.. అజాగ్రత్తగా ఉంటే ఖాతా ఖాళీయే!

QR Code Scam Alert: మీరు చెల్లింపుల కోసం ఎక్కువగా యూపీఐని వాడుతున్నారా? అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే! ఎందుకంటే మీరు కూడా ఈ కొత్త స్కామ్కు బాధితులు అయ్యే అవకాశం ఉంది. ఈ స్కామ్లో ఫేక్ క్యూఆర్ కోడ్లను చూపించి కస్టమర్ల ఫోన్లను సులభంగా హ్యాక్ చేయవచ్చు. ఈ నయా మోసం నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

QR Code Scam: క్యూఆర్ కోడ్లతో కొత్త స్కామ్.. అజాగ్రత్తగా ఉంటే ఖాతా ఖాళీయే!
Qr Code
Follow us
Ravi C

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 21, 2024 | 3:30 PM

భారత్​లో చెల్లింపులు చేయడానికి యూపీఐ (యూనిఫైడ్​ పేమెంట్​ ఇంటర్​ఫేస్​), క్యూఆర్​ కోడ్​ ఉపయోగంతో మొత్తం లావాదేవీల వ్యవస్థనే మారిపోయింది. దేశంలో యూపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. నవంబర్​లో 15.48 బిలియన్ల లావాదేవీలు జరగగా అక్టోబర్​ నాటికి ఇది 7 శాతం పెరిగింది. ఈ విధానం నచ్చి విదేశాలు సైతం యూపీఐని వాడుతున్నాయి. కానీ, యూపీఐకి డిమాండ్​ పెరగడంతో మోసం చేసేందుకు కొత్తదారులు వెతుకున్నారు మోసగాళ్లు. కొత్తగా ఇప్పుడు స్కామర్లు క్యూఆర్​ కోడ్​ ద్వారా మోసాలకు దిగుతున్నారు.

దుకాణాలు, రెస్టారెంట్లలో నకిలీ కోడ్లు

నేటి కాలంలో క్యూఆర్​ కోడ్​ ద్వారా చెల్లింపుల్లో వేగం పెరుగుతోంది. ఈ సౌలభ్యాన్ని అవకాశంగా తీసుకుని స్కామర్లు కూడా డబ్బును కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దుకాణాలు, బండ్లు, డెలివరీ ఏజెంట్లు మొదలైన ప్రదేశాల్లో నకిలీ క్యూఆర్​ కోడ్​లను ఉంచుతారు. వినియోగదారులు క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేయగానే వారి ఖాతాను హ్యాక్​ చేస్తారు. ఇదే కాకుండా కొన్ని సార్లు స్కామర్లు ఏపీకే లింక్​ను క్యూఆర్​ కోడ్​తో అనుసంధానిస్తారు. దీనితో కోడ్​ స్కాన్​ చేయగానే వైరస్​ ఉన్న అప్లికేషన్లు ఫోన్​లో డౌన్​లోడ్​ అవుతాయి. దాని ద్వారా వినియోగదారుల ఖాతాలోని డబ్బు అంతా కొల్లగొడుతారు.

ఈ ముప్పును ఎలా నివారించాలి?

ఇలాంటి మోసాలను నివారించడానికి మొదటి మార్గం అప్రమత్తంగా ఉండటమే. యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు క్యూఆర్​ కోడ్​పై ఆధారపడే బదులు చెల్లింపును స్వీకరించే వ్యక్తికి చెందిన ధ్రువీకరించిన యూపీఐ ఐడీ లేదా మొబైల్​ నంబర్​కు నేరుగా డబ్బు పంపడం ఉత్తమం. అంతేకాకుండా చెల్లింపు సమయంలో అవతలి వ్యక్తి మనకు తెలియనప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదేకాకుండా అనుమానాస్పదంగా అనిపించే కొత్త స్థలాలు లేదా వ్యాపారాల్లో క్యూఆర్​ను స్కాన్​ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. రెస్టారెంట్లు, షాపుల్లో నకిలీ క్యూఆర్​ కోడ్​లను స్కామర్లు సులభంగా ఇన్​స్టాల్​ చేయవచ్చు. అందువల్ల చెల్లింపు చేసే ముందు క్యూఆర్​ కోడ్​ సరైనదేనా? కాదా? అని ప్రతిసారి ధ్రువీకరించుకోవాలి.