PLI Schemes: ఆ కేంద్ర ప్రభుత్వ పథకం సూపర్ సక్సెస్.. ఆత్మనిర్బర్ భారత్ కల సాకారం దిశగా అడుగులు
భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఆత్మ నిర్బర్ భారత్ విజన్ దిశగా కేంద్రం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీమ్ ఆ కలను సాకారం చేస్తుంది. ఈ చర్యలతో భారతదేశంలో రూ.1.97 లక్షల వ్యయంతో ఉత్పత్తి, ఎగుమతి సామర్థ్యాలను వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యాల గురించి మరిన్ని తెలుసుకుందాం.
ఆత్మనిర్భర్ భారత్ విజన్ కింద స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తూ రూ.1.97 లక్షల వ్యయంతో దేశానికి సంబంధించిన ఉత్పాదక, ఎగుమతి సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రొడెక్ట్ లింక్డ్స్ ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కీలక పాత్ర పోషిస్తుంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం నవంబర్ 2020లో ప్రారంభించిన పీఎల్ఐ పథకం 14 కీలక రంగాలను కవర్ చేస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1.46 లక్షల కోట్లు అంటే 17.5 బిలియన్ల డాలర్ల విలువైన పెట్టుబడులను సాధించారు. తద్వారా ఉత్పత్తి, విక్రయాలను రూ.12.50 లక్షల కోట్లు అంటే150 బిలియనల డాలర్లకు పెరిగింది. అలాగే ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు అంటే 48 బిలియన్ డాలర్లు పెంచేందు ఆస్కారం ఏర్పడింది. అలాగే పీఎల్ఐ స్కీమ్ ద్వారా 9.5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎల్ఐ స్కీమ్ వల్ల ఉపయోగాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ ఏడాది పీఎల్ఐ స్కీమ్ ప్రోత్సాహకాల్లో భాగంగా రూ.9,721 కోట్లు అందించారు. మొబైల్ తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, టెలికం, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీల వంటి 14 కీలక రంగాలను విస్తరించి పీఎల్ఐ పథకం భారతదేశపు తయారీ రంగ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసింది. పీఎల్ఐ స్కీమ్ కింద పది మంత్రిత్వ శాఖలకు సంబంధించిన విభాగాల పర్యవేక్షణలో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 1,300 కంటే ఎక్కువ తయారీ యూనిట్లు స్థాపించారు. విస్తృతమైన వికేంద్రీకరణ వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధికి ఆజ్యం పోసింది. పీఎల్ఐ స్కీమ్‌లో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ బాగా వృద్ధిని నమోదు చేశాయి.
ముఖ్యంగా వైట్ గూడ్స్ అంటే ఎయిర్ కండిషనర్లు, ఎల్ఈడీ లైట్ల తయారీ సంస్థలకు పీఎల్ఐ స్కీమ్ బాగా ఉపయోగపడింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటిక వరకు ఈ రంగంలో 48,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించారు. ముఖ్యంగా పీఎల్ఐ స్కీమ్ ద్వారా ఈ రంగంలో దేశీయ విలువ జోడింపు 20-25 శాతం నుంచి 75-80 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ విభాగానికి సంబంధించిన మూడో రౌండ్ దరఖాస్తులు రూ.4,121 కోట్ల సంభావ్య పెట్టుబడులతో 38 మంది కొత్త దరఖాస్తుదారులు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. పీఎల్ఐ స్కీమ్ కింద మొబైల్ తయారీ, ఎలక్ట్రానిక్ భాగాలు, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్, అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీలు, హై-ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్ డ్రోన్‌లు, డ్రోన్ కాంపోనెంట్‌లు వంటి 14 ఫోకస్ సెక్టార్‌లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి