AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account Activation: మీ అకౌంట్ డీ యాక్టివేట్ అయ్యిందా? రీ యాక్టివేట్ చేయడం చాలా సింపుల్

భారతదేశంలో బ్యాంకింగ్ రంగం దినదినాభివృద్ధి చెందుతుంది. అయితే భారతదేశంలో పౌరులకు వారి వారి అవసరాల నిమిత్తం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండడం పరిపాటిగా మారింది. అయితే ఒక్కోసారి ఆ ఖాతాలను రెగ్యూలర్‌గా అవి డీయాక్టివేట్ అవుతాయి. ఈ నేపథ్యంలో డీయాక్టివేట్ అయిన బ్యాంకు ఖాతాలను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో? ఓసారి తెలుసుకుందాం.

Bank Account Activation: మీ అకౌంట్ డీ యాక్టివేట్ అయ్యిందా? రీ యాక్టివేట్ చేయడం చాలా సింపుల్
Bank Accounts
Nikhil
|

Updated on: Dec 21, 2024 | 4:10 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అధికారిక నోటీసులో దేశవ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో ఇన్‌యాక్టివ్ ఖాతాలు, అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య సంపూర్ణ పరంగా వాటి మొత్తం డిపాజిట్లను మించిపోయిందని వెల్లడించింది. దీనిపై ఇటీవల సమీక్ష నిర్వహించిన అనంతరం ఆర్‌బీఐ ఈ ప్రకటన చేసింది. డిసెంబర్ 2, 2024 ఆర్‌బీఐ ప్రకటన ప్రకారం ఖాతాదారుల వివరాల్లో అసమతుల్యత, పేరులో అసమతుల్యత వంటి అనాలోచిత తప్పులతో సహా పనిచేయని ఖాతాల యాక్టివేషన్ కోసం ఖాతాదారులు బ్యాంకు శాఖలను సంప్రదించినప్పుడు అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొంది. 

కొన్ని బ్యాంకులు కేవైసీకు సంబంధించిన అప్‌డేట్  చేయాల్సిన ఖాతాలను కూడా పెండింగ్‌లో పెట్టారని గుర్తించారు. స్తంభింపచేసిన లేదా ఇన్ యాక్టివ్ ఖాతాల సంఖ్యను తగ్గించడానికి వాటిని తిరిగి యాక్టివేట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్, నాన్-హోమ్ బ్రాంచ్‌లు, వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ మొదలైన వాటి ద్వారా సులభంగా కేవైసీ అప్‌డేట్ చేయాలని సూచించింది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

  • ముందుగా ఖాతాదారులు బ్యాంక్ శాఖను సందర్శించి మీ సంతకంతో రాసిన దరఖాస్తును పూరించాలి. 
  • గుర్తింపు, చిరునామాకు సంబంధించిన స్వీయ ధ్రువీకరణ నిర్ధారణను అందించాలి.
  • మీరు లావాదేవీని ప్రారంభించిన తర్వాత మీ ఖాతా మళ్లీ యాక్టివేట్ చేస్తారు.

పీఎన్‌బీ

  • ఖాతా యాక్టివేషన్, అప్‌డేట్ చేసిన కేవైసీ డాక్యుమెంట్‌ల కోసం అభ్యర్థన లేఖతో బ్యాంక్ బేస్ బ్రాంచ్‌ని సందర్శించాలి. 
  • యూఐడీఏఐకు సంబధించిన బయోమెట్రిక్ ఈ-కేవైసీ ద్వారా ప్రమాణీకరణ కోసం మీ ఆధార్ నంబర్‌ను అందించాలి. 
  • కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసిన తర్వాత ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడానికి కనీసం రూ. 100 డిపాజిట్ చేయాలి. 

ఎస్‌బీఐ 

  • ఇన్‌యాక్టివ్ ఖాతా ఉన్న కస్టమర్ అత్యంత ఇటీవలి కేవైసీ డాక్యుమెంటేషన్‌తో ఏదైనా ఎస్‌బీఐ శాఖను సందర్శించాలి.
  • ఖాతాను యాక్టివేట్ చేయడానికి బ్యాంకు అధికారులు దరఖాస్తును అందింాచరు. కస్టమర్ అందించిన కేవైసీ డాక్యుమెంటేషన్ ఆధారంగా బ్రాంచ్ ఖాతాను యాక్టివేట్ చేస్తుంది.
  • ఖాతా యాక్టివేట్ అయిన తర్వాత కస్టమర్‌కి ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి