AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola: ఇక జొమాటో, స్విగ్గీకి దబిడి దిబిడే.. క్విక్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ఓలా ఎంట్రీ

క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా ఫుడ్ డెలివరీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓలా డాష్ అనే పేరుతో ఈ సేవలను ప్రారంభించింది. కేవలం 10 నిమిషాల్లోనే ఆహారాన్ని డెలివరీ చేస్తామని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ఓ పోస్ట్లో పేర్కొన్నారు. దీంతో స్విగ్గీ, జొమాటోకు గట్టి పోటీ ఉంటుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Ola: ఇక జొమాటో, స్విగ్గీకి దబిడి దిబిడే.. క్విక్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ఓలా ఎంట్రీ
Food DeliveryImage Credit source: Getty Images
Ravi C
| Edited By: |

Updated on: Dec 21, 2024 | 2:07 PM

Share

దేశంలో ఇన్​స్టాంట్​ డెలివరీ యాప్​లకు భారీగా ప్రజాదరణ లభిస్తోంది. కేవలం 10 నిమిషాల్లో కిరాణ సామగ్రి, ఆహారం డెలివరీ అవుతుండటంతో ప్రజల పనిని సులభతరం అవుతోంది. బట్టల నుంచి ఫుడ్​ వరకు అన్ని క్విక్​​ డెలివరీ విభాగంలోకి ప్రవేశించడానికి చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటివి ఈ రంగాలను డామినేట్​ చేస్తున్నాయి. తాజాగా క్యాబ్​ సర్వీసెస్​ దిగ్గజం ఓలా కూడా ఈ విభాగంలోకి అడుగుపెట్టింది. ఓలా కంపెనీ ‘డాష్’ పేరుతో క్విక్​ ఫుడ్​ డెలివరీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో జొమాటో, స్విగ్గీకి మరో ప్రధాన పోటీదారు ఎదురవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఓఎన్​డీసీ సహకారంతో..

ఓలా సహా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్​ అగర్వాల్​ మాట్లాడుతూ.. ఓపెన్​ నెట్​వర్క్​ ఫర్​ డిజిటల్​ కామర్స్​ (ఓఎన్​డీసీ) ప్లాట్​ఫాం సాయంతో దేశంలో ఊపు మీద ఉన్న క్విక్​ ఫుడ్​ డెలివరీ మార్కెట్​లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్​ ఖాతాలో పోస్ట్​ చేశారు. ఓఎన్​డీసీ పట్ల తమ నిబద్ధత ఉందని ఆయన పేర్కొన్నారు. నేడు భారత్​ వ్యాప్తంగా ఆహారం, నిత్యావసర వస్తువుల డెలివరీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఇందులో 10 నిమిషాల్లోనే అందించే క్విక్​ ఫుడ్​ డెలివరీ కూడా ఉందని తెలిపారు.

ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ X పోస్ట్

మొదట బెంగళూరు నుంచి..

దేశంలో ఓఎన్​డీసీ వాణిజ్య భవిష్యత్తు అని అగర్వాల్​ ఉద్ఘాటించారు. ఓఎన్​డీసీ అనేది డిజిటల్​ నెట్​వర్క్​ల ద్వారా వస్తువులు, ఇతర సేవల డెలివరీ కోసం ఓపెన్​ నెట్​వర్క్​లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఓలా తన డాష్​ సేవలను బెంగళూరులో మాత్రమే అందిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్​ డెలివరీ చేస్తుంది. నివేదికల ప్రకారం ఓలా ప్రధాన అప్లికేషన్​లోని ఫుడ్​ సెక్షన్​లో డాష్​ సేవలను అందిస్తోంది.

డాష్​ కాన్సెప్ట్​ పాతదే..

డాష్​ అనేది ఓలా కంపెనీకి చెందిన పాత అప్లికేషన్​. 10 నిమిషాల్లో కిరాణా సామగ్రిని డెలివరీ చేసేందుకు దీన్ని 2022లో ప్రారంభించారు. అయితే 6 నెలల పాటు కొనసాగించి ఆ తర్వాత యాప్​ కార్యాకలపాలను ఓలా నిలిపివేసింది. అయితే, ఓలా పోటీ దారులైనా జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటివి ఇంకా ఈ రంగంలో కొనసాగుతున్నారు.

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?