Ultraviolette F77: ఆకర్షిస్తున్న అల్ట్రావైలెట్‌ నయా బైక్‌.. సూపర్‌ ఫీచర్ల వివరాలివే..!

భారతదేశంలో ఈవీ వాహనాల అమ్మకాలు ఇటీవల జోరుగా సాగుతున్నాయి. అయితే ఈవీ వాహనాల్లో స్కూటర్లే ఎక్కువగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కానీ ఈవీ బైక్‌ అంతలా ఆకట్టుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ అల్ట్రావైలెట్‌ తీసుకొచ్చిన ఎఫ్‌-77 ఈవీ బైక్‌పై బైక్‌ లవర్స్‌ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమైన అల్ట్రావైలెట్‌ ఎఫ్‌-77 బైక్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Ultraviolette F77: ఆకర్షిస్తున్న అల్ట్రావైలెట్‌ నయా బైక్‌.. సూపర్‌ ఫీచర్ల వివరాలివే..!
Ultraviolette F77 Super Street
Follow us
Srinu

|

Updated on: Feb 03, 2025 | 8:15 AM

ఎఫ్‌-77 సూపర్ స్ట్రీట్ అనేది బెంగళూరు ఆధారిత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ స్టార్టప్ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ రిలీజ్‌ చేసిన సూపర్‌ బైక్‌. పేరులో పేర్కొన్నట్లుగానే ఎఫ్‌-77 సూపర్ స్ట్రీట్ అల్ట్రావైలెట్‌ ఎఫ్‌-77 మ్యాక్ 2 పై ఆధారపడి పని చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ భారతదేశంలో రూ.2.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద  అందుబాటులో ఉంటుంది. అయితే ఈ బైక్ కోసం బుకింగ్లు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి.అల్ట్రావైలెట్‌ ఎఫ్‌-77 సూపర్ స్ట్రీట్ డెలివరీలు మార్చి 2025లో ప్రారంభం కానున్నాయి. ఇక డిజైన్‌ విషయానికి వస్తే అల్ట్రావైలెట్‌ ఎఫ్‌-77 సూపర్ స్ట్రీట్ బైక్‌ మ్యాక్‌-2తో సమానంగా వస్తుంది. ఈ బైక్‌ ఎల్‌ఈడీ హెర్ల్యాంప్, పెద్ద సైడ్ ప్యానెల్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు సంబంధించిన ఎర్గోనామిక్స్ ఇప్పుడు మార్చారు. అందువల్ల రైడర్ నిటారుగా కూర్చోవడానికి కొత్త హ్యాండిల్ బార్ సెటప్‌తో వస్తుంది. 

అల్ట్రావైలెట్‌ ఎఫ్‌-77సూపర్ స్ట్రీట్ బైక్‌ నాలుగు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌ను మనం టర్బో రెడ్, ఆఫ్టర్ బర్నర్ ఎల్లో, స్టెల్లార్ వైట్, కాస్మిక్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.  అల్ట్రావైలెట్‌ ఎఫ్‌-77 సూపర్ స్ట్రీట్ ఫీచర్ల విషయానికి వస్తే ఈ బైక్‌లో ఎల్ఈడీ లైట్లు ఆకట్టుకుంటాయి. అలాగే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కలర్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 10 లెవెల్ బ్రేకింగ్ సిస్టమ్, మల్టీ రైడ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు యువత అమితంగా ఇష్టపడతారు. 

అల్ట్రావైలెట్‌ ఎఫ్‌-77 బైక్ 10.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ బైక్ 30 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌తో రావడం వల్ల అల్ట్రావైలెట్‌ ఎఫ్‌-77 బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 323 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే ఈ బైక్ గరిష్టంగా 155 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అల్ట్రావైలెట్‌ ఎఫ్‌-77 సూపర్ స్ట్రీట్ బైక్ మ్యాక్-2 మాదిరిగానే సస్పెన్షన్ డ్యూటీ కోసం అప్ సైడ్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ అబ్జార్బర్‌తో వస్తుంది అలాగే బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ముందు, వెనుక టైర్స్ డిస్క్ బ్రేక్ కంట్రోల్‌తో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి