AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సామాన్యులకు అందుబాటులో లగ్జరీ ట్రెయిన్స్..!

వందేభారత్ స్లీపర్-చైర్ కార్, అమృత్ భారత్, నమో భారత్ 350 రైళ్ల ఉత్పత్తి జరుగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకు కేంద్ర బడ్జెట్‌లో ఆమోదం లభించిందన్నారు. దీంతో ఈ రైలు ఉత్పత్తికి మార్గం సుగమమైందన్నా అశ్విని వైష్ణవ్.. ఈ రైళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లకు భిన్నంగా ఉంటాయన్నారు.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సామాన్యులకు అందుబాటులో లగ్జరీ ట్రెయిన్స్..!
Ashwini Vaishnaw On Luxury Trains
Balaraju Goud
|

Updated on: Feb 02, 2025 | 9:39 PM

Share

దేశంలో వందే భారత్ రైలు వచ్చిన తర్వాత దానికి డిమాండ్ పెరిగింది. ఈ రైలు లగ్జరీ, సెమీ హైస్పీడ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ రైలు టికెట్ ధర కాస్తా ఎక్కువ. దీంతో సామాన్యులు ప్రయాణించలేకపోతున్నారు. అయితే త్వరలో దేశంలోని సామాన్య ప్రజలు కూడా లగ్జరీ రైళ్లలో ప్రయాణించనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన రైళ్లను నడపనుంది. దీంతో అన్ని తరగతుల ప్రజలు సుఖంగా, సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం రైల్వే మంత్రిత్వ శాఖ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. దీనికి బడ్జెట్‌లో ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందుకే ఈ రైలుకు దేశంలోనే అత్యధిక డిమాండ్ ఉంది. ఇప్పుడు దీని స్లీపర్ వెర్షన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. దీంతో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మేలు జరుగుతుంది. ఈ రైళ్ల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పేర్కొన్నారు.

అమృతభారత్ సామాన్యులకు వందేభారత్ లాంటి సౌకర్యాలతో కూడిన రైలు అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ రైలును ఏడాదిపాటు పరీక్షిస్తున్నారు. ఇప్పుడు అది పూర్తయింది. గతేడాది ఈ విభాగంలో రెండు సార్లు నడిచాయి. ఇప్పుడు అమృతభారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నారు. అలాగే రెండు ప్రధాన నగరాల మధ్య నమో భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ రైలు గుజరాత్‌లోని గుజ్ – అహ్మదాబాద్ మధ్య నడుస్తోంది. ఈ రైళ్ల సంఖ్యను కూడా పెంచబోతున్నారు. ఈ రైలు పెద్ద నగరాల నుండి సమీప నగరాలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.

వందేభారత్ స్లీపర్-చైర్ కార్, అమృత్ భారత్, నమో భారత్ 350 రైళ్ల ఉత్పత్తి జరుగుతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికి బడ్జెట్‌లో ఆమోదం లభించింది. దీంతో ఈ రైలు ఉత్పత్తికి మార్గం సుగమమైంది. ఈ రైళ్లు గత బడ్జెట్‌లో ప్రకటించిన రైళ్లకు భిన్నంగా ఉంటాయి. వీటిలో 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమో భారత్ రైళ్లు, 200 వందే భారత్ (స్లీపర్ , ఛైర్) ఉన్నాయి. రెండు మూడేళ్లలో ఈ రైలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..