AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers: కేంద్ర సర్కార్‌ స్కీమ్‌.. రైతులు ఇలా చేయండి.. నెలకు రూ.3000 పొందవచ్చు.. పూర్తి వివరాలు..!

Farmers:  కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా పథకాలను రూపొందిస్తోంది...

Farmers: కేంద్ర సర్కార్‌ స్కీమ్‌.. రైతులు ఇలా చేయండి.. నెలకు రూ.3000 పొందవచ్చు.. పూర్తి వివరాలు..!
Subhash Goud
|

Updated on: Aug 29, 2021 | 7:26 PM

Share

Farmers:  కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా పథకాలను రూపొందిస్తోంది. ఇక సామాన్య ప్రజలకు, రైతులకు వివిధ రకాల పెన్షన్‌ పథకాలను అందుబాటులో ఉంచింది. మోదీ సర్కార్ కేవలం ఈ ఒక్క స్కీమ్ మాత్రమే కాకుండా రైతుల కోసం మరో పథకం కూడా అందుబాటులో ఉంచింది. అదే ‘పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన’. ఈ పథకంలో కూడా రైతులు చేరవచ్చు. మీరు ఇప్పటికీ కూడా ఈ స్కీ్‌మ్‌లో చేరకపోతే ఇప్పుడైనా ఇందులో చేరవచ్చు.

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.3,000 వస్తాయి. 18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. ఈ స్కీమ్‌లో ఇప్పటికే 21 లక్షల మందికిపైగా రైతుల చేరారు. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు.

ఈ స్కీమ్‌లో చేరాలంటే..

స్కీమ్‌లో చేరాలంటే ఆధార్ కార్డు, పొలం పట్టా పాస్‌బుక్‌, బ్యాంక్ పాస్‌బుక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. ఇలా స్కీమ్‌లో చేరిన రైతులు ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లిస్తూ ఉండాలి. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి. 18 ఏళ్ల వయసు కలిగన వారు నెలకు రూ.55 కట్టాలి.30 ఏళ్లు ఉన్నవారు వారు స్కీమ్‌లో చేరితే నెలకు రూ.110 చెల్లించాలి. అదే 40 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.200 కట్టాలి. ఇక 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రైతులకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. 5 ఎకరాల వరకు పొలం కలిగిన రైతులు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చెల్లించే మొత్తానికి సమానమైన డబ్బులను మీ ఖాతాలో జమ చేస్తుంది. ఏదైనా కారణంగా ఈ స్కీమ్‌లో నెలనెల డబ్బులు వేయడం నిలిపివేస్తే ఆ డబ్బులేమి వృధా కావు. స్కీమ్‌ నిలిపివేస్తే డిపాజిట్‌ చేసిన మొత్తం బ్యాంకు ఖాతా వలె వడ్డీ పొందుతారు. ఇక రైతు ఏదైనా కారణంగా మరణిస్తే.. వారి భాగస్వామికి 50 శాతం డబ్బులు చెల్లిస్తారు.

ఇవీ కూడా చదవండి:

EPF Aadhar link: ఈపీఎఫ్ రూల్స్ మారుతున్నాయి.. వెంటనే ఆధార్‌తో మీ పీఎఫ్ లింక్ కోండి.. లేకుంటే ఎలా చేయండి..

Nominee: బ్యాంకు ఖాతా.. వివిధ పథకాల్లో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? నమోదు చేయకపోతే ఏమవుతుంది..?

Business Ideas: మీరు టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా..? లాభం ఎంతో తెలిస్తే షాకవుతారు..