AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Aadhar link: ఈపీఎఫ్ రూల్స్ మారుతున్నాయి.. వెంటనే ఆధార్‌తో మీ పీఎఫ్ లింక్ కోండి.. లేకుంటే ఎలా చేయండి..

EPF Aadhar link: ఆధార్‌తో.. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కు లింక్ చేసుకునేందుకు  గడువు దగ్గరపడుతోంది. ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్స్ (ECR) దాఖలు చేయడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తో ఆధార్ సీడ్...

EPF Aadhar link: ఈపీఎఫ్ రూల్స్ మారుతున్నాయి.. వెంటనే ఆధార్‌తో మీ పీఎఫ్ లింక్ కోండి.. లేకుంటే ఎలా చేయండి..
Sanjay Kasula
|

Updated on: Aug 29, 2021 | 9:43 AM

Share

ఆధార్‌తో.. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కు లింక్ చేసుకునేందుకు  గడువు దగ్గరపడుతోంది. ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్స్ (ECR) దాఖలు చేయడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తో ఆధార్ సీడ్ చేయడానికి ఈపీఎఫ్ఓ ​​గడువును సెప్టెంబర్ 1, 2021 వరకు పొడిగించింది. చివరి తేదీకి మరో రెండు రోజులు మాత్రమే మిగిలివుంది. సంస్థ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ని ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీని కోసం, EPFO ​​సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142 లో మార్పులు చేసింది. ఇది ECR ఫైలింగ్ ప్రోటోకాల్‌ని మార్చింది.

ఈ నెల 31 వరకు మాత్రమే..

ప్రతి ఉద్యోగి/కార్మికుడు వెంటనే తమ తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలని EPFO ప్రకటించింది. ఇందుకు ఈ నెల 31 వరకు మాత్రమే గడువు ఉందని ప్రకటించింది. లేకపోతే కంపెనీలు/సంస్థ యజమానులు వాళ్ల ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలోకి డబ్బు జమ చేయడం సాధ్యం కాదు. రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందడమూ వీలుకాదు. వచ్చే నెల నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రకటించింది.

డబ్బు తీసుకోవడం కూడా కష్టం

ఆధార్‌-UAN సీడింగ్‌ కోసం కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020లోని సెక్షన్ 142ను సవరించింది. కొత్త విధానం గురించి లీగల్ ఎక్స్ పర్ట్‌ వైభవ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఇక నుంచి PF మెంబర్లు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే ఆధార్ నంబర్-UAN లింకింగ్ తప్పనిసరి అని పేర్కొంది. రెండింటిని లింక్ చేయనివారికి PF కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాదు.. ఇతర EPFO సేవలు కూడా ఆగిపోతాయని చెప్పారు. పెన్షన్ ఫండ్‌ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టమవుతుంది.

వడ్డీని సైతం పొందలేరు..

పెన్షన్ ఫండ్‌కి అందించే డబ్బు కూడా అందులో పడదు. ఉద్యోగులు తమ వడ్డీని సైతం పొందలేరు. కంట్రిబ్యూషన్లు డిపాజిట్ చేయకపోవడం వల్ల యజమానులు/కంపెనీలుగా కూడా డిఫాల్టర్లు అవుతారు. ఫలితంగా చట్టప్రకారం శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. ఉద్యోగుల లింకింగ్ పూర్తయ్యే వరకు వాళ్ల ఖాతాలో కంపెనీలు తమ కంట్రిబ్యూషన్‌ను డిపాజిట్ చేయడం కూడా వీలపడదు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆర్గనైజేషన్ ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) దాఖలు చేసే రూల్స్ కూడా మారాయి. ఇక నుంచి ఆధార్‌తో లింక్ అయిన పీఎఫ్ ఖాతాకు మాత్రమే ఎలక్ట్రానిక్ చలాన్-కమ్ -రిటర్న్‌లను దాఖలు చేయడానికి యజమానులను అనుమతిస్తామని ఈపీఎఫ్‌ఓ ఇది వరకే ప్రకటించింది.

PF ఖాతాకు ఆధార్‌ని లింక్ చేయడం ఇలా

1) PF ఖాతాకు ఆధార్ జోడించడానికి epfindia.gov.in ని సందర్శించండి

2) ఆన్‌లైన్ సర్వీసెస్‌లో E-KYC పోర్టల్‌పై క్లిక్ చేయండి

3) ఇప్పుడు ఆధార్ సంఖ్యను నమోదు చేయండి. అప్పుడు మొబైల్ నంబర్ ఇవ్వండి. మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.

4) ఇప్పుడు మరోసారి, ఆధార్ నంబర్ నింపాల్సి ఉంటుంది. తరువాత మీకు వచ్చిన OTP ని ధృవీకరించండి.

5) OTP, ఆధార్ నంబర్, మొబైల్ ఫోన్ నంబర్‌ను మూడుసార్లు నమోదు చేసిన తర్వాత,

మీ PF ఖాతాతో ఆధార్ లింక్ పూర్తి అవుతుంది.

ఇవి కూడా చదవండి: Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..

TV9 Exclusive: ఆఫ్గన్‌ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం.. తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ..