Tata Punch EV: టాటా ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్.. బుకింగ్స్ ఓపెన్.. స్టన్నింగ్ ఫీచర్లు ఇవే
ఈవీ వాహనాల్లో ముఖ్యంగా టూ వీలర్స్ ఎక్కువ ప్రజాదరణ పొందాయి. మైలేజ్ సంబంధిత భయాలతో ఈవీ కార్లు సేల్స్ అనుకున్నంతగా లేవు. అయితే మారిన టెక్నాలజీ నేపథ్యంలో ఈవీ కార్లు కూడా మతిపోయే మైలేజ్‌తో వస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ పంచ్‌కు సంబంధించిన ఎలక్ట్రిఫైడ్ వెర్షన్ గురించి మంచి గుడ్ న్యూస్‌ను అందించింది. టాటా కంపెనీకు సంబంధించిన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన పంచ్ ఈవీ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలపై ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు అందరూ ఈవీలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఈవీ వాహనాల్లో ముఖ్యంగా టూ వీలర్స్ ఎక్కువ ప్రజాదరణ పొందాయి. మైలేజ్ సంబంధిత భయాలతో ఈవీ కార్లు సేల్స్ అనుకున్నంతగా లేవు. అయితే మారిన టెక్నాలజీ నేపథ్యంలో ఈవీ కార్లు కూడా మతిపోయే మైలేజ్‌తో వస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ పంచ్‌కు సంబంధించిన ఎలక్ట్రిఫైడ్ వెర్షన్ గురించి మంచి గుడ్ న్యూస్‌ను అందించింది. టాటా కంపెనీకు సంబంధించిన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన పంచ్ ఈవీ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. టాటా పంచ్ ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కొత్త టాటా పంచ్ ఈవీ కంపెనీకు సంబంధించి కొత్త యాక్టీ ఈవీ ఆర్కిటెక్చర్‌పై అభివృద్ధి చేశారని కంపెనీ పేర్కొంది. ఈ ఈవీల కోసం అభివృద్ధి చేసిన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి వచ్చిన కొత్త ఆర్కిటెక్చర్ అని కంపెనీ పేర్కొంటుంది. టాటా పంచ్ ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన మొదటి ఈవీ అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. టాటా మోటార్స్ తన మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, పంచ్ ఈవీ కోసం రూ. 21,000 బుకింగ్ మొత్తానికి బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. టాటా పంచ్ ఈవీ కోసం బుకింగ్‌లను ఆన్‌లైన్‌లో ప్రారంభించిన అలాగే దేశవ్యాప్తంగా అధీకృత టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ల ద్వారా కూడా బుకింగ్లను అందుబాటులో ఉంచింది.
టాటా మోటార్స్‌కు సంబంధించిన పంచ్ ఈవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికి వస్తే అధికారింకంగా కంపెనీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే కంపెనీ షేర్ చేసిన చిత్రాలు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన టీజర్ ఆధారంగా టాటా పంచ్ ఈవీ పూర్తిగా పునఃరూపకల్పన చేసిన ఫ్రంట్ ఎండ్‌తో వస్తుంది. అలాగే ఈ కారు కొత్త డిజైన్ ఫిలాసఫీతో మరింత ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా ఈ కారు నెక్సాన్ ఈవీ మాదిరిగా ఉంటుంది. టాటా పంచ్ ఈవీ ఫ్రంట్ ఎండ్ కొత్త బంపర్, గ్రిల్, హెడ్లైట్ హౌసింగ్, ఫాగ్ ల్యాంప్లతో ఫ్రంట్ ఫాసియాను పొందుతుంది. అయితే కంపెనీ తన ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌లో పంచ్‌కు సంబంధించిన సిల్హౌట్, వెనుక డిజైన్ను అలాగే ఉంచింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..