AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Transfer Limit: రూ. 5లక్షలకు పెరిగిన యూపీఐ లిమిట్.. కానీ జనవరి 10లోపు ఆ పని చేస్తేనే..

యూపీఐ ట్రాన్స్ ఫర్ లిమిట్ ను భారీగా పెంచింది. కొన్ని కేటగిరీలకు చెందిన లావాదేవీల లిమిట్ ను సవరించింది. ముఖ్యంగా హాస్పటల్స్, విద్యా సంబంధమైన సంస్థలకు ప్రస్తుతం ఉన్న యూపీఐ ట్రాన్స్ ఫర్ లిమిట్ ను రూ. 1లక్ష నుంచి రూ. 5లక్షలకు పెంచింది. ఈ మేరకు గత నెలలోనే ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేందుకు గానూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

UPI Transfer Limit: రూ. 5లక్షలకు పెరిగిన యూపీఐ లిమిట్.. కానీ జనవరి 10లోపు ఆ పని చేస్తేనే..
Upi Payments
Madhu
| Edited By: TV9 Telugu|

Updated on: Jan 09, 2024 | 12:32 PM

Share

యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) రాకతో దేశంలోని బ్యాంకింగ్ రంగ స్వరూపమే మారిపోయింది. వేగంగా డిజిటలీకరణ జరగడానికి ఇది బాగా దోహదం చేసింది. ఈ క్రమంలో ఆర్బీఐ యూపీఐ కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుని వినియోగదారులకు దానిని మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా గత నెలలో యూపీఐ ట్రాన్స్ ఫర్ లిమిట్ ను భారీగా పెంచింది. కొన్ని కేటగిరీలకు చెందిన లావాదేవీల లిమిట్ ను సవరించింది. ముఖ్యంగా హాస్పటల్స్, విద్యా సంబంధమైన సంస్థలకు ప్రస్తుతం ఉన్న యూపీఐ ట్రాన్స్ ఫర్ లిమిట్ ను రూ. 1లక్ష నుంచి రూ. 5లక్షలకు పెంచింది. ఈ మేరకు గత నెలలోనే ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా దీనిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేందుకు గానూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేటరీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు తమ సమ్మతిని తెలియజేసేందుకు జనవరిలో 10 వరకూ సమయం ఇచ్చింది. ఈ లోపు దానిలోని సభ్యులు అంటే బ్యాంకులు, వివిద చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు(పీఎస్పీలు), యూపీఐ అప్లికేషన్లు తమ సమ్మతిని నిర్ధారించాలని ఆదేశించింది.

జనవరి 10 నుంచి అమలు..

యూపీఐ ట్రాన్స్ ఫర్స్ కు సంబంధించిన లిమిట్ పెంపుదలను జనవరి 10 నుంచి అమలు చేయాలని ఎన్పీసీఐ చూస్తోంది. అందుకు గానూ తన సభ్యులను నిర్ధారించమని కోరింది. వాస్తవానికి ఈ లిమిట్ పెంపు అనేది బహుళ ప్రయోజనాలను అందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరుగుతుంటాయి. ఆయా చోట్ల ఇప్పటి వరకూ రూ. 1లక్ష వరకూ మాత్రమే లావాదేవీ జరుపుకునే వీలుండేది. అయితే ఇప్పుడు దీనిని రూ. 5లక్షలకు పెంచడంతో వీటి వినియోగం ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాక జనవరి 10 నుంచి ఈ మార్పును అమలు చేయడంలో ఎటువంటి సవాళ్లు రావని వారు చెబుతున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మర్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

వారికి మాత్రమే వర్తిస్తుంది..

అయితే ఈ లిమిట్ పెంపు అనేది వెరిఫై చేసిన వ్యాపారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. ఎన్పీసీఐ సభ్యులు అంటే పీఎస్పీలు, బ్యాంకులు, యూపీఐ యాప్స్, వ్యాపారులు, ఇతర చెల్లింపులు ప్రొవైడర్లు అందరూ ఈ మార్పును గమనించాలని, తమ సమ్మతిని నిర్ధారిస్తూనే.. అవసరమైన ఇతర మార్పులను తమ ప్లాట్ ఫారంలలో చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియం అంతా 2024 జనవరి 10లోపు చేసుకోవాలని ఓ సర్క్యూలర్లో పేర్కొంది. వ్యాపారులు ముందుగా పెరిగిన యూపీఐ చెలింలపుల మోడ్ ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ధృవీకరించబడిన వ్యాపారులను దీనిలో జోడించేందుకు ఆయా సంస్థలు బాధ్యత వహిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..