Mushroom Farming: ఏం ఐడియా గురూ.. పుట్టగొడుగుల పెంపకంతో నెలకు ఇరవై లక్షల ఆదాయం..!
ఇండోర్‌కు చెందిన ఒక మహిళ దానిని అవకాశంగా మార్చుకుంది. ఆమె ఆ గడ్డితో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది. అంతేకాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తుంది. పూజా దూబే పాండే ఇండోర్‌కు చెందిన ఒక వైద్యురాలు. పెరుగుతున్న కాలుష్యం సమస్యకు చెక్ పెట్టడంతో పాటు పొల్లాల్లో పుట్టగొడుగులను పండించాలని నిర్ణయించుకుంది. తన ప్రత్యేకమైన విధానంతో ఆమె తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంది.
కాలుష్యం వల్ల ఏర్పడే పొగమంచు కారణంగా ఢిల్లీలోని ప్రజలు తరచూ ఇబ్బంది పడతారు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో గడ్డిని కాల్చడం వల్ల వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ)ని బాగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గడ్డిని కాల్చడం అనేది చాలా కాలంగా ఉన్న సమస్య అయితే ఇండోర్‌కు చెందిన ఒక మహిళ దానిని అవకాశంగా మార్చుకుంది. ఆమె ఆ గడ్డితో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది. అంతేకాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తుంది. పూజా దూబే పాండే ఇండోర్‌కు చెందిన ఒక వైద్యురాలు. పెరుగుతున్న కాలుష్యం సమస్యకు చెక్ పెట్టడంతో పాటు పొల్లాల్లో పుట్టగొడుగులను పండించాలని నిర్ణయించుకుంది. తన ప్రత్యేకమైన విధానంతో ఆమె తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంది. పూజా దూబే పాండే తీసుకున్న చర్యలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం.
ఓ సారి ఢిల్లీ పర్యటనలో ఆమెకు ఈ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఢిల్లీకి వెళ్లినప్పుడు కాలుష్యాన్ని గమనించిన ఆమె ఈ సమస్యను ఎందుకు అవకాశంగా మార్చుకోకూడదని మనసులో అనుకుంది. ఆమె మెరుగైన పర్యావరణం కోసం కొంత సహకారం అందిస్తూనే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది. ఈ ప్రయాణంలో తనకు సహాయ సహకారాలు అందించే యువతకు కూడా ఆమె శిక్షణ ఇస్తోంది. ఆమె చొరవ కారణంగా పుట్టగొడుగుల పెంపకం నుంచి మంచి డబ్బు సంపాదిస్తోంది. డాక్టర్ పూజా దూబే పాండే 2017లో ఇండోర్‌లో బీఈటీఐ పేరుతో పుట్టగొడుగుల పెంపకం కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే రోజులు గడిచే కొద్దీ బయోటెక్ ఎరా ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అంటే పరిశోధన, శిక్షణ కోసం స్థాపించిన ఈ సంస్థ భారతదేశంలో పుట్టగొడుగులను పెంచే వారికి నమ్మకమైన కస్టమ్ స్పాన్ సేవలు, శిక్షణ అందిస్తూ ఉంటుంది. ఈ సంస్థ సాయంతో 2019లో ఆమె కంపెనీ స్టార్టప్ ఇండియా చొరవ కింద డీపీఐఐటీ సర్టిఫైడ్ స్టార్టప్‌గా మారింది. కంపెనీకి పూజా, ప్రదీప్ పాండే అనే ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు.
పూజా తన మష్రూమ్ స్పాన్ ప్రొడక్షన్ లాబొరేటరీని ప్రారంభించేందుకు పరిశోధన, విద్యావేత్తలు, పరిశ్రమలో తన 10 సంవత్సరాల అనుభవాన్ని ఉంచారు, ఇది విద్యార్థులకు శిక్షణ, ఇంటర్న్‌షిప్, పరిశోధన ప్రాజెక్టులను అందించడం ద్వారా నైపుణ్యం మరియు ఉత్పత్తి అభివృద్ధి కార్యక్రమాలను కూడా పరిచయం చేసింది. బీఈటీఐ ఉత్పత్తులు ఇప్పుడు శ్రీలంక, నేపాల్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయని ప్రదీప్ పాండే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం తమ స్టార్టప్ వ్యాపారంతో 25 మంది ఉపాధి పొందుతున్నారని ఆయన వెల్లడించారు. తన నెలవారీ టర్నోవర్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం రూ.15 నుంచి రూ.20 లక్షలుగా ఉందని వెల్లడించారు. ఈ సంస్థ పుట్టగొడుగుల పెంపకంతో పాటు బిస్కెట్లు, నామ్కీన్, ఇతర వస్తువులను కూడా తయారు చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..