Success Story: బ్యాంకు ఉద్యోగానికి గుడ్ బై చెప్పి పుట్టగొడుగుల సాగు చేస్తున్న యువకుడు.. నెలకు వేలల్లో సంపాదన
జార్ఖండ్‌కు చెందిన ఒక రైతు పుట్టగొడుగులను పెంచుకుని తన తలరాతను తానే మార్చుకున్నాడు. ఇప్పుడు పుట్టగొడుగులను పెంచుతూ నెలకు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. పుట్టగొడుగుల సాగు చేస్తున్న ఈ రైతు పేరు దేవాశిష్ కుమార్. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని జంషెడ్‌పూర్ నివాసి. ఎకరంన్నర భూమిలో పుట్టగొడుగులు సాగు చేసి నెలకు రూ.50 నుంచి 60 వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. అయితే దేవాశిష్ కుమార్ కేవలం రూ.1000తో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు.
పుట్టగొడుగుల కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు, మినరల్స్, డైటరీ ఫైబర్, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. ఈ పుట్టగొడుగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానవ శరీరంలో పోషకాల లోపం ఉండదు. మార్కెట్‌లో పుట్టగొడుగులకు డిమాండ్ పెరగడానికి ఇదే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో సాగు చేసే రైతుల సంఖ్య కూడా పెరుగుతోంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని రైతులు ఇప్పుడు సంప్రదాయ పంటలతో పాటు పుట్టగొడుగులను కూడా సాగు చేస్తున్నారు. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలాంటి ఓకే రైతు గురించి ఈ రోజు తెలుసుకుందాం..
జార్ఖండ్‌కు చెందిన ఒక రైతు పుట్టగొడుగులను పెంచుకుని తన తలరాతను తానే మార్చుకున్నాడు. ఇప్పుడు పుట్టగొడుగులను పెంచుతూ నెలకు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. పుట్టగొడుగుల సాగు చేస్తున్న ఈ రైతు పేరు దేవాశిష్ కుమార్. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని జంషెడ్‌పూర్ నివాసి. ఎకరంన్నర భూమిలో పుట్టగొడుగులు సాగు చేసి నెలకు రూ.50 నుంచి 60 వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. అయితే దేవాశిష్ కుమార్ కేవలం రూ.1000తో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో పని చేసిన దేవాశిష్
దేవాశిష్ కుమార్ పొలం బాట పట్టక ముందు బ్యాంక్ ఉద్యోగి. ఎంబిఏ చదివిన దేవాశిష్ 2015కి ముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగం చేశాడు. అప్పుడు బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఉన్న రాజేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ పుట్టగొడుగుల పెంపకం గురించి సమాచారాన్ని తెలుసుకున్నాడు. దేవశిష్ కు ఆసక్తి పెరగడంతో పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చి రూ.1000 పెట్టుబడితో పుట్టగొడుగుల సాగుకు శ్రీకారం చుట్టాడు. మొదట్లో అతని కుటుంబ సభ్యులు అతని నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ.. నిరాశ చెందలేదు. తాను పుట్ట గొడుగుల పెంపకంపై దృష్టిని కొనసాగించాడు.
పుట్టగొడుగుల తయారీలో శిక్షణ ఇస్తున్న దేవాశిష్
దేవాశిష్ కుమార్‌కి సొంత ఊరులో చాలా పెద్ద ఇల్లు ఉంది. తన ఇంట్లోని నాలుగు గదుల్లో పుట్టగొడుగుల సాగు చేస్తున్నాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. పుట్టగొడుగుల ఉత్పత్తి బాగానే ఉంది. మార్కెట్ లో కూడా పుట్టగొడుగులను మంచి ధర లభించింది. పుట్టగొడుగులను అమ్మి మంచి ఆదాయాన్ని ఆర్జించాడు. ఆ తర్వాత దేవాశిష్ కుమార్ వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు తాను చేస్తున్న వ్యవసాయంలో ఇద్దరు మహిళలను నియమించుకుని వారికీ ఉపాధి కూడా కల్పించాడు. విశేషమేమిటంటే పుట్టగొడుగుల ఉత్పత్తితో పాటు కొత్తవారికి పుట్టగొడుగుల తయారీలో దేవాశిష్ శిక్షణ ఇస్తున్నాడు.
ఎలా సాగు చేస్తున్నాడంటే
నాలుగు గదుల విస్తీర్ణం దాదాపు ఒకటిన్నర ఎకరాల భూమికి సమానమని దేవాశిష్ చెప్పారు. వేసవి కాలంలో గదిలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి నేలపై మూడు అంగుళాల ఇసుకను పరిచారు. అనంతరం ఆ ఇసుకపై ఎప్పటికప్పుడు నీటిని స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన గదిలోని ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. దేవాశిష్ ప్రధానంగా మిల్కీ మష్రూమ్, ఓస్టెర్, వరి గడ్డి, క్లౌడ్ మష్రూమ్‌లను పండిస్తున్నాడు. అంతేకాదు మష్రూమ్ పౌడర్ తయారు చేసి వాటిని కూడా అమ్మకానికి పెడుతున్నాడు. వినియోగదారులు కొందరు ,స్వయంగా దేవశిష్ దగ్గరకు వెళ్లి మరీ నాణ్యమైన పుట్టగొడుగులనుఁ ఖరీదు చేస్తారు. శీతాకాలంలో, పుట్టగొడుగులను నాలుగు గదులకు బదులుగా ఆరు గదులలో సాగు చేస్తానని చెప్పారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..