Chicken Prices: చికెన్ ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన కోడి ధరలు.. మార్కెట్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
మార్కెట్‌లో ధరలు మండిపోతున్నాయి.. బియ్యం నుంచి పప్పుల వరకు.. కూరగాయల నుంచి నాన్ వెజ్ వరకు.. అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి.. ఇటీవల చికెన్ రేటుకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కిలో రూ.250 వరకు చేరింది. కార్తీకమాసం ముగిసిన తర్వాత చికెన్ రేటు గణనీయంగా పెరుగుతూ వచ్చింది.. రూ.150 రూపాయల ఉన్న కిలో చికెన్ ధర ఒక్కసారిగా 250కి చేరింది..
మార్కెట్‌లో ధరలు మండిపోతున్నాయి.. బియ్యం నుంచి పప్పుల వరకు.. కూరగాయల నుంచి నాన్ వెజ్ వరకు.. అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి.. ఇటీవల చికెన్ రేటుకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కిలో రూ.250 వరకు చేరింది. కార్తీకమాసం ముగిసిన తర్వాత చికెన్ రేటు గణనీయంగా పెరుగుతూ వచ్చింది.. రూ.150 రూపాయల ఉన్న కిలో చికెన్ ధర ఒక్కసారిగా 250కి చేరింది.. న్యూఇయర్ వేళ కూడా రేట్లు భారీగా పెరిగాయి. ఆ తర్వాత చికెన్ ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడం లాంటి పరిణామాలతో రేట్లు పెరిగాయి.. అంతేకాకుండా కోడిగుడ్ల రేట్లు కూడా భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డు బహిరంగ మార్కెట్ లో ఏడు రూపాయల నుంచి 8 రూపాయలుగా ఉంది. దీంతో మాంసం కొనలేక, గుడ్లు తినలేక మాంసం ప్రియులు చాలా ఇబ్బందులు పడ్డారు.
ఈ తరుణంలో మాంసం ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. ఎందుకంటే పెరిగిన చికెన్ ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన చికెన్ ధరలు తగ్గాయి. ఇటీవల రూ. 250 పలికిన చికెన్ ఇప్పుడు.. రూ.150 కి పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 150 – 160 విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ.120-130 వరకు ఉంది. అయితే, డిమాండ్ కంటే సప్లయ్ ఎక్కువగా ఉండటంతో ధర తగ్గినట్లు షాపుల యజమానులు పేర్కొంటున్నారు. తగ్గిన చికెన్ ధరలు సంక్రాంతి వరకు ఇలానే కొనసాగితే పండగ సీజన్‌లో భారీ విక్రయాలు జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే, కోడి ధరలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. ఒక్కో గుడ్డు మార్కెట్ లో 6 నుంచి 7రూపాయలు పలుకుతోంది.
ఇదిలాఉంటే.. కూరగాయలు ధరలు మాత్రం షాకిస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. అలానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ టమాట రూ.30 గా ఉంది.. అన్ని రకాల కూరగాయల ధరలు.. 40పైగానే పలుకుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..