Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Panels: ఎండాకాలంలో సోలార్ ప్యానెళ్ల హవా.. రికార్డు దాటిన టాటా రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్లు..

గృహ విద్యుత్తు దాదాపుగా ప్ర‌తి రాష్ట్రంలోనూ వినియోగ‌దారుల‌కు భారంగానే మారుతోంది. ఈ నేప‌థ్యంలో గృహ వినియోగ‌దారుల‌కు పాతికేళ్ల వ‌ర‌కు పైసా క‌రెంటు బిల్లు క‌ట్ట‌న‌వ‌స‌రం లేకుండా.. ఇంటికి రాయితీపై త‌క్కువ ఖ‌ర్చుతో సౌర విద్యుత్తు వెలుగులు పంచే ఒక ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. దీనికి అనుగుణంగానే టాటా పవర్ వారు తీసుకొచ్చిన సోలార్ పానెళ్లకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా వీటి విక్రయాలు రికార్డు స్థాయిని దాటేశాయి.

Solar Panels: ఎండాకాలంలో సోలార్ ప్యానెళ్ల హవా.. రికార్డు దాటిన టాటా రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్లు..
Solar Panels Installations Summer
Follow us
Bhavani

|

Updated on: Mar 23, 2025 | 8:38 PM

ఎండాకాలం రాగానే ముందుగా గుర్తొచ్చేది.. గుండె గుబేలుమనిపించేది కరెంటు చార్జీలే. దీని నుంచి కాపాడుకునేందుకు చాలా మంది సోలార్ పానెళ్ల వినియోగంపై మొగ్గు చూపుతున్నారు. సోలార్ పానెళ్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సైతం మద్దతునిస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్రం సూర్య ఘర్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఇంటిపై సోలార్ పానెళ్లను వినియోగించుకునే వారికి ఏకంగా 30 నుంచి 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన పెరిగి సోలార్ పానెళ్ల వాడకం కూడా పెరుగుతోంది. తాజాగా టాటా పవర్ సంస్థ సోలార్ పానెళ్ల విక్రయాల్లో రికార్డు క్రియేట్ చేసింది.

గృహ వినియోగ‌దారుల‌ను సౌర విద్యుత్తు వినియోగం వైపు ప్రోత్స‌హించి, మామూలు క‌రెంటు వినియోగాన్ని త‌గ్గించి వారికి విద్యుత్తు భారం నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌క‌మే రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్‌. దీని ద్వారా ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు అమ‌ర్చి ప‌గ‌లంతా మీరు సౌర విద్యుత్తు ఉప‌యోగించుకుని రాత్రి పూట మాత్రం డిస్కంలు స‌ర‌ఫ‌రా చేసే విద్యుత్తును ఉప‌యోగించుకునేలా చేయడమే ఈ ప‌థ‌కం ప్రత్యేక‌త‌.

టాటా పవర్ భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ రంగంలో అద్భుతమైన మైలురాయిని సాధించింది. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేసిన ఈ సంస్థ, మొత్తం 3 గిగావాట్ల సామర్థ్యంతో ఈ రంగంలో అగ్రగామిగా నిలిచింది. 700కు పైగా నగరాల్లో విస్తరించి, సుస్థిర భవిష్యత్తు కోసం భారత్‌ను ముందుకు నడిపిస్తూ, దేశంలోనే నంబర్ వన్ రూఫ్‌టాప్ సోలార్ ప్రొవైడర్‌గా తన స్థానాన్ని సుదృఢం చేసుకుంది.

గత 10 ఏళ్లుగా బ్రిడ్జ్ టు ఇండియా గుర్తింపు పొందిన టాటా పవర్, తమ ‘ఘర్ ఘర్ సోలార్’ కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (పీఎంఎస్జీవై)కు భారీగా తోడ్పడుతోంది. తమిళనాడులోని అత్యాధునిక ప్లాంట్‌లో సర్టిఫికేషన్ పొందిన సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తూ, ఈ పథకానికి సాధికారత కల్పిస్తోంది. ఇంకా, 25 ఏళ్ల వారంటీతో కూడిన అత్యుత్తమ నాణ్యత గల సోలార్ మాడ్యూల్స్, సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లతో కస్టమర్లకు అండగా నిలుస్తోంది.

టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు విద్యుత్ బిల్లులను 80 శాతం వరకు తగ్గించడంతో పాటు, 4-7 ఏళ్లలో పెట్టుబడిని వెనక్కి పొందే అవకాశం కల్పిస్తాయి. విద్యుత్ టారిఫ్‌లు సంవత్సరానికి 3-5 శాతం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యవస్థ ఆర్థిక భారం నుంచి రక్షణ అందిస్తుంది. 20కి పైగా ఆర్థిక భాగస్వాముల సహకారంతో సౌర విద్యుత్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ కృషి చేస్తోంది.