- Telugu News Photo Gallery Business photos Brand new royal enfield 650cc classic bike india launch date confirmed details in telugu
Royal Enfield 650: మరో నాలుగు రోజుల్లో కొత్త బుల్లెట్ బండి లాంచ్.. స్టన్నింగ్ ఫీచర్లు ఇవే..!
భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌ను బుల్లెట్ బండి అని ముద్దుగా పిలుచుకుంటారు. దేశంలో వయస్సుతో సంబంధం లేకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల కాలంలో ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఎప్పటికప్పుడు కొత్త బైక్స్‌ను మార్కెట్‌లో లాంచ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో మరో నాలుగు రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ క్లాసిక్ బైక్ లాంచ్ కానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ క్లాసిక్ మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Mar 23, 2025 | 8:00 PM

రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్చి 27న భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్లాసిక్ 650ను విడుదల చేయనుంది. 650సీసీ క్రూయిజర్ బైకెన్ 650, సూపర్ మీటియర్ 650, ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, బేర్ 650 తర్వాత బ్రాండ్ నుంచి రిలీజ్ అయ్యే బైక్ క్లాసిక్ 650.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గత సంవత్సరం కొత్త క్లాసిక్ 650ని ఆవిష్కరించింది. డిజైన్ పరంగా ఇది క్లాసిక్ 350లో మాదిరిగానే రెట్రో లుక్‌తో లాంచ్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ క్లాసిక్ బైక్‌లో 647 సీసీ, ఎయిర్/ఆయిల్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ క్లాసిక్ బైక్ 46.4 హెచ్‌పీ పవర్, 52.3 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేసి స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 క్లాసిక్ ఇంజిన్, అండర్ పిన్నింగ్‌లను షాట్రన్ 650తో పంచుకుంటుంది. ఇది ఒకే ఫ్రేమ్‌తో వస్తుంది. అలాగే ఒకేలాంటి సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ క్లాసిక్ బైక్ సింగిల్ 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 ఎంఎం సింగిల్ డిస్క్ బ్రేక్స్‌తో వస్తాయి. క్లాసిక్ 650 బైక్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో ఆకట్టుకుంటుంది.





























