Tata Motors: దుమ్మురేపిన టాటా మోటర్స్ షేర్లు.. ఒక్కరోజులో 20 శాతం జంప్.. షేర్‌ హోల్డర్లకు కనక వర్షం

టాటా గ్రూప్ చెందిన పలు కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్‎లో దూసుకెళ్తున్నాయి. టాటా మోటర్స్ ఈరోజు షేర్‌ హోల్డర్లకు కనక వర్షం కురిపించింది. బీఎస్ఈలో ఏకంగా 20 శాతం పెరిగింది. షేరు ధర రూ. 421 నుంచి 85 రూపాయలు పెరిగి రూ. 506 చేరింది...

Tata Motors: దుమ్మురేపిన టాటా మోటర్స్ షేర్లు.. ఒక్కరోజులో 20 శాతం జంప్.. షేర్‌ హోల్డర్లకు కనక వర్షం
Stock Market
Follow us

|

Updated on: Oct 13, 2021 | 6:49 PM

టాటా గ్రూప్ చెందిన పలు కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్‎లో దూసుకెళ్తున్నాయి. టాటా మోటర్స్ ఈరోజు షేర్‌ హోల్డర్లకు కనక వర్షం కురిపించింది. బీఎస్ఈలో ఏకంగా 20 శాతం పెరిగింది. షేరు ధర రూ. 421 నుంచి 85 రూపాయలు పెరిగి రూ. 506 చేరింది. టాటా మోటార్స్‌ విద్యుత్తు వాహన విభాగంలోకి టీపీజీ రైజ్‌ క్లైమేట్‌ నుంచి బిలియన్‌ డాలర్లు సమీకరించడమే ఇందుకు కారణంగా మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. గత మూడు రోజుల్లోనే ఈ స్టాక్‌ విలువ 46 శాతం పెరిగింది.

పెట్రోల్, డిజీల్ రేట్లు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. టాటా మోటర్స్ ఈవీ వాహనాలు తయారు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా టీపీజీ రైజ్‌ క్లైమేట్‌ నుంచి దాదాపు రూ.7500 కోట్లు సమీకరించనుంది. దీంతో ఈ కంపెనీపై మదుపర్లకు విశ్వాసం పెరగటంతో స్టాక్ విలువ భారీగా పెరిగింది.

దేశంలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవటంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో టాటా పవర్ షేరు విలువ కూడా భారీగానే పెరిగింది. టాటా పవర్ 14 శాతంతో 28 రూపాయలు పెరిగి రూ.224కు చేరుకుంది. టాటా ఎలెక్సీ 0.72 శాతంతో 43 రూపాయలు పెరిగి రూ.6116కు చేరింది. టీసీఎస్ రూ.3656 వద్ద ఉంది. టైటాన్ 42 రూపాయలు పెరిగి రూ.2537కు చేరింది. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను దక్కించకోవటం కూడా ఆ గ్రూప్ కంపెనీలపై సానుకూల ప్రభావం చూపింది.

Read Also.. Stock Market Today: స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బుల్ జోరు.. ఆల్ టైమ్ రికార్డు స్థాయికి సెన్సెక్స్