AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Curvv SUV Coupe: టాటా నుంచి కొత్త ఎస్‌యూవీ.. మార్కెట్లో గేమ్ చేంజర్ కానుందా?

టాటా మోటార్స్ కూడా అధికారికంగా కర్వ్ ఎస్‌యూవీ(Curvv SUV)ని పరిచయం చేసింది. ఇది డీ-సెగ్మెంట్ ఎస్‌యూవీ మార్కెట్లో తన సత్తా చాటేందుకు మార్కెట్లోకి వస్తోంది. ఈ డీ-సెగ్మెంట్లో ఇప్పటికే పాపులర్ అయిన హ్యూందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లతో ఈ టాటా కర్వ్ డైరెక్ట్ గా పోటీపడనుంది. ఇప్పుటు టాటా కర్వ్ ఎస్‌యూవీ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, డిజైన్ వంటివి చూద్దాం..

Tata Curvv SUV Coupe: టాటా నుంచి కొత్త ఎస్‌యూవీ.. మార్కెట్లో గేమ్ చేంజర్ కానుందా?
Tata Curvv Suv Coupe
Madhu
|

Updated on: Jul 20, 2024 | 4:23 PM

Share

మన దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీ వేరియంట్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కంపెనీలు వివిధ ఎస్‌యూవీలను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ కూడా అధికారికంగా కర్వ్ ఎస్‌యూవీ(Curvv SUV)ని పరిచయం చేసింది. ఇది డీ-సెగ్మెంట్ ఎస్‌యూవీ మార్కెట్లో తన సత్తా చాటేందుకు మార్కెట్లోకి వస్తోంది. ఈ డీ-సెగ్మెంట్లో ఇప్పటికే పాపులర్ అయిన హ్యూందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లతో ఈ టాటా కర్వ్ డైరెక్ట్ గా పోటీపడనుంది. ఇప్పుటు టాటా కర్వ్ ఎస్‌యూవీ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, డిజైన్ వంటివి చూద్దాం..

టాటా కర్వ్ ఎస్‌యూవీ డిజైన్..

ఈ కర్వ్ డిజైన్ సమకాలీన టాటా ఎస్‌యూవీ మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. ప్రాముఖ్యంగా బంపర్స్, హెడ్ ల్యాంప్స్, టాటా సిగ్నేచర్ ఎల్ఈడీ ఐబ్రో లైటింగ్ వంటివి ఉంటాయి. సైడ్ డోర్లు యూనిక్ పాప్ అవుట్ డోర్ హ్యాండిళ్లను కలిగి ఉంటాయి. పెటల్ ఆకారంలోని అల్లాయ్ వీల్స్ ఉంటాయి. 2024 భారత్ మొబలిటీ ఎక్స్ పో లో ప్రదర్శించిన మాదిరిగానే ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

టాటా కర్వ్ ఎస్‌యూవీ ఇంటిరీయర్..

ఈ కారు ఇంటీరియర్ గురించి ఇంకా పూర్తి స్థాయిలో రివీల్ కాలేదు. అయితే నెక్సాన్, హ్యారియర్ వేరియంట్ల మాదిరిగానే ఇది ఉండే అవకాశం ఉంది. అలాగే అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్(అడాస్) ఫీచర్ లెవెల్-2 కేపబులిటీతో ఉంటుంది. 360 డిగ్రీల కెమెరా పార్కింగ్ ను సులభతరం చేస్తుంది. పానరోమిక్ సన్ రూఫ్, వెటిలేటెడ్ సీట్లు సౌకర్యాన్ని అందిస్తాయి. పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉంటుంది. డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది.

టాటా కర్వ్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్స్..

ఈ కర్వ్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మొదటిది 1.2 లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ యూనిట్. ఇది 123 బీహెచ్పీ 225ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిక్స్-స్పీడ్ మాన్యువల్, సెవెన్-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్(డీసీటీ) ఉంటుంది. అలాగే డీజిల్ వేరియంట్ వచ్చేసరికి 1.5 లీటర్ ఇంజిన్, 113 బీహెచ్పీ, 260ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో సిక్స్- స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఉంటుంది.

ధర ఎంతంటే..

ఈ కారు ధర గురించి ఆగస్టు ఏడో తేదీన కంపెనీ ప్రకటించనుంది. ఆ రోజు కర్వ్ ఈవీ వెర్షన్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఆ లాంచ్ సందర్భంగా ఈ కారు ధరను కూడా ప్రకటించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us