కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది..? ప్రధాన మంత్రులు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారా?

కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది..? ప్రధాన మంత్రులు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారా?

Ravi Panangapalli

|

Updated on: Jul 20, 2024 | 5:30 PM

నిజానికి 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి బడ్జెట్ రెడీ చెయ్యడం అంత ఆషామాషీ విషయం కాదు. దీనికి చాలా పే.. ద్ద ప్రాసెస్ ఉంటుంది. వేర్వేరు రంగాలకు చెందిన స్టేక్ హోల్టర్స్ కలిసి.. నెలల కొద్దీ కష్టబడి బడ్జెట్ కసరత్తు పూర్తి చేస్తారు.

నిజానికి 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి బడ్జెట్ రెడీ చెయ్యడం అంత ఆషామాషీ విషయం కాదు. దీనికి చాలా పే.. ద్ద ప్రాసెస్ ఉంటుంది. వేర్వేరు రంగాలకు చెందిన స్టేక్ హోల్టర్స్ కలిసి.. నెలల కొద్దీ కష్టబడి బడ్జెట్ కసరత్తు పూర్తి చేస్తారు. బడ్జెట్ ప్రిపరేషన్‌కు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని శాఖలకు, విభాగాలకు, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, స్వయం పాలిత ప్రాంతాలకు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వారి వారి బడ్జెట్ ప్రపోజల్స్ పంపాలని కోరుతుంది. ఆర్థిక శాఖ విజ్ఞప్తి మేరకు ఆయా మంత్రిత్వ శాఖలు గత ఏడాది వారి రాబడి, ఖర్చులు, వచ్చే ఏడాదికి సంబంధించిన ఎస్టిమేషన్లను ఆర్థిక శాఖకు పంపుతాయి. ఆ తర్వాత వాటన్నింటినీ ఆర్థిక శాఖ పరిశీలిస్తుంది. ఆయా మంత్రిత్వ శాఖలతో, అధికారిక విభాగాలతో చర్చిస్తుంది. రాబోయే ఖర్చులు ,రాబడికి సంబంధించిన చర్చ వారి మధ్య జరుగుతుంది. ఒక వేళ వారి మధ్య నిధుల కేటాయింపుల విషయంలో ఏవైనా విభేదాలొస్తే.. అప్పుడు ఆ విషయాన్ని కేంద్ర క్యాబినెట్ లేదా ప్రధాని దృష్టి తీసుకొస్తారు. అలాగే డిపార్ట్మెంట్ ఆప్ ఎకనమిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ రెండూ కలిసి దేశంలోని వ్యవసాయం, చిన్న తరహా వ్యాపారులు, విదేశీ పెట్టుబడి దారులకు సంబంధించిన సంఘాలు, నేతలతో కూడా చర్చించి వారి అభిప్రాయాలను, సూచనలను తీసుకుంటాయి.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.