AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget South focus : దక్షిణాదిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి.. భారీగా బడ్జెట్‌ కేటాయింపులు

గత ఫిభ్రవరిలో కేంద్ర ఆర్ధిక మంత్రి పార్లమెంట్‌లో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు చాలా రచ్చ చేశాయి. కర్నాటకకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ ఎంపీలు గొడవకు దిగిన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి బడ్జెట్‌లో ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్‌ మరింత పెంచుతారా ?

Budget South focus : దక్షిణాదిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి.. భారీగా బడ్జెట్‌ కేటాయింపులు
Pm Modi Budget
Balaraju Goud
|

Updated on: Jul 21, 2024 | 7:28 AM

Share

గత ఫిభ్రవరిలో కేంద్ర ఆర్ధిక మంత్రి పార్లమెంట్‌లో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు చాలా రచ్చ చేశాయి. కర్నాటకకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ ఎంపీలు గొడవకు దిగిన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి బడ్జెట్‌లో ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్‌ మరింత పెంచుతారా ?

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణభారతంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అయినప్పటికి దక్షిణంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టిని కొనసాగించే అవకాశం ఉంది. సౌత్‌లో బీజేపీకి ఓట్లశాతం గణనీయంగా పెరిగింది. బడ్జెట్‌తో దక్షిణాది ప్రజలకు మరింత చేరువ కావడానికి మోదీ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.

బడ్జెట్‌ కేటాయింపుల్లో తీరని అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్‌ , కర్నాటక సీఎం సిద్దరామయ్య , కేరళ సీఎం విజయన్‌ కేంద్రంపై ముప్పేట దాడి చేస్తున్నారు. కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపిస్తున్నారు. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ దక్షిణాది నుంచే కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తునప్పటికి ఎప్పుడు న్యాయం చేయలేదని ఆరోపిస్తున్నారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో కూడా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు నిర్మలా బడ్జెట్‌తో సమాధానమిస్తారా ? వేచి చూడాలి..

భారత్‌ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి దేశం లోని అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేస్తున్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర కీలకమని ఎన్నోసార్లు చెప్పారు. అయితే పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి ఎక్కువ నిధులు వస్తున్న విషయాన్ని స్టాలిన్‌ , సిద్దరామయ్య పదే పదే గుర్తు చేస్తున్నారు. కాని బడ్జెట్‌ కేటాయాంపులో ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ గత ఫిభ్రవరిలో ప్రవేశపెట్టిన తరవాత కర్నాటక కాంగ్రెస్‌ ఎంపీలు మామూలు రచ్చచేయలేదు. నిధుల కేటాయింపులో తమ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని , దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా చేయాలన్న డిమాండ్‌ వరకు వాళ్లు వెళ్లారు. ఈసారి కూడా డిమాండ్ల సాధన కోసం దక్షిణాది ఎంపీలు గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది. కేంద్రం వాళ్ల డిమాండ్లకు ఏ స్థాయిలో స్పందిస్తుందో నిర్మల పద్దులే తేలుస్తాయి.

తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా కేంద్రం తీరుపై సమయం చిక్కినప్పుడల్లా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణ భారతానికి కేంద్రం నిధులు ఆపేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను కేంద్రం ఖండిస్తోంది. ఈసారి కూడా కూడా తమిళనాడుతో పాటు అన్ని రాష్ట్రాలకు బడ్జెట్‌ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేస్తోంది. 2009 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం తమిళనాడును ఏటా కేవలం 879 కోట్లు మాత్రమే విడుదల చేసిందని , కాని తాము మాత్రం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.6331 కోట్లు కేటాయించినట్టు వివరణ ఇస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…