Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holiday: విద్యార్థులకు శుభవార్త.. అక్కడ సోమవారం విద్యాసంస్థలు మూసివేత

శనివారం కూడా మూసి ఉన్న పాఠశాలలు.. ఆదివారం ఎలాగో సెలవే ఉంటుంది. ఇక సోమవారం కూడా సెలవు ప్రకటిస్తూ అక్కడి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, ప్రీ-యూనివర్శిటీ కళాశాలలకు సెలవు ప్రకటించాయి. శనివారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. జూలై 21 ఆదివారం, కాబట్టి ఇప్పుడు పాఠశాలలు సోమవారం తెరుచుకుంటాయి. అయితే ఇప్పుడు సోమవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది..

School Holiday: విద్యార్థులకు శుభవార్త.. అక్కడ సోమవారం విద్యాసంస్థలు మూసివేత
School Holiday
Follow us
Subhash Goud

|

Updated on: Jul 21, 2024 | 7:52 AM

భారీ వర్షాల దృష్ట్యా, నాగ్‌పూర్, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. శనివారం కూడా మూసి ఉన్న పాఠశాలలు.. ఆదివారం ఎలాగో సెలవే ఉంటుంది. ఇక సోమవారం కూడా సెలవు ప్రకటిస్తూ అక్కడి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, ప్రీ-యూనివర్శిటీ కళాశాలలకు సెలవు ప్రకటించాయి. వాయనాడ్‌లోనూ శనివారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. జూలై 21 ఆదివారం, కాబట్టి ఇప్పుడు పాఠశాలలు సోమవారం తెరుచుకుంటాయి. అయితే యుపిలోని బదౌన్ జిల్లాలో, శనివారం కాకుండా, సోమవారం కూడా సెలవు ప్రకటించారు అధికారులు. పాఠశాలలు మంగళవారం ఓపెన్‌ కానున్నాయి. ఒక వేళ వర్షం అలాగే ఉన్నట్లయితే మంగళవారం కూడా విద్యాసంస్థలు మూసి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దేశంలో చాలా రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు. అలాగే ఏపీలోని కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణతో పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి వర్షం కారణంగా రోడ్లన్ని జలమయం అవుతున్నాయి.

బదౌన్‌లోని పాఠశాలలకు సోమవారం సెలవు

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో కన్వర్ యాత్ర కారణంగా శనివారం నుంచి సోమవారం వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీని ప్రయోజనం పొందనున్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి వీరేంద్రకుమార్ సింగ్ ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని పాఠశాలలను ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని కౌన్సిల్ గుర్తింపు పొందిన, ఎయిడెడ్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు శ్రావణ మాసంలో ప్రతి శనివారం, సోమవారం మూసి ఉంచనున్నారు.

ఇది కాకుండా, వారణాసి జిల్లా పాలనా యంత్రాంగం సావన్ మాసంలో సోమవారం అన్ని పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయంలో రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం కూడా వారణాసి పరిపాలన సోమవారం పాఠశాలను మూసివేయాలని నిర్ణయించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి