Fake Gold Jewelry: మీ బంగారు అభరణాలు నకిలీవా? ఒరిజినలా? ఇలా సులభంగా గుర్తించండి!

ఇటీవల కాలంలో నకిలీ బంగారం కూడా వెలుగులోకి వస్తుంది. మార్కెట్లో నకిలీ బంగారం వ్యాపారం ఎంత అరికట్టినా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఎలాంటి అనుమానం రాకుండానే నకిలీ వస్తువులను ఒరిజినల్‌గా తయారు చేసి అమాయకులను నిలువునా మోసగిస్తున్న సంఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోల్‌గోల్డ్‌ కూడా అచ్చం అసలు బంగారం లాగానే ఉంటున్నాయి...

Fake Gold Jewelry: మీ బంగారు అభరణాలు నకిలీవా? ఒరిజినలా? ఇలా సులభంగా గుర్తించండి!
Gold
Follow us

|

Updated on: Jul 21, 2024 | 9:01 AM

ఇటీవల కాలంలో నకిలీ బంగారం కూడా వెలుగులోకి వస్తుంది. మార్కెట్లో నకిలీ బంగారం వ్యాపారం ఎంత అరికట్టినా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఎలాంటి అనుమానం రాకుండానే నకిలీ వస్తువులను ఒరిజినల్‌గా తయారు చేసి అమాయకులను నిలువునా మోసగిస్తున్న సంఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోల్‌గోల్డ్‌ కూడా అచ్చం అసలు బంగారం లాగానే ఉంటున్నాయి. ప్రస్తుతం అన్ని షాపుల్లో రోల్డ్‌ గోల్డ్‌ హవా కొనసాగుతుంది. ఒరిజినల్‌ బంగారానికి తీసిపోని విధంగా ఈ రోల్డ్‌ గోల్డ్‌ ఉంటున్నాయి. ఒరిజినల్‌ బంగారం అంటూ నకిలీ బంగారం ఇచ్చి అమాయకులను మోసగిస్తున్న సంఘటనలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. బంగారం, నగలు కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే నిలువునా మోసపోయే ప్రమాదం ఉంది. మరి నకిలీ బంగారం, అభరణాలను ఎలా గుర్తించాలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంట్లోనే ఉండి కూడా మీ నగలు ఒరిజినలా, అవి నకిలీవా? అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచోచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: జూలై 21న బంగారం ధర పెరిగిందా? తగ్గిందా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

నకిలీ అభరణాలను గుర్తించడం ఎలా?

మీరు కూడా బంగారం కొనుగోలు చేయబోతున్నట్లయితే, అసలు, నకిలీ బంగారాన్ని ఎలా గుర్తించాలో మీరు తెలుసుకోవాలి. కల్తీ, నకిలీ బంగారాన్ని కూడా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఆభరణాలపై హాల్‌మార్క్ మార్క్ ఉందని గుర్తించుకోండి. ఇది స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు చాలా మంది ఆభరణాలపై నకిలీ హాల్‌మార్క్ వేస్తున్నారు. అందువల్ల బంగారాన్ని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, ఇంట్లో ఉంచిన బంగారం స్వచ్ఛతను కూడా మీరు సులభంగా తెలుసుకోవచ్చు. బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

బంగారంపై కొన్ని చుక్కల వెనిగర్ వేసి కొన్ని నిమిషాల తర్వాత జాగ్రత్తగా చూడండి. బంగారం రంగులో మార్పు రాకపోతే అది స్వచ్ఛమైన బంగారం అని అర్థం. నకిలీ బంగారం వెనిగర్‌తో కలిసిన వెంటనే నల్లగా మారుతుంది. అయస్కాంతాలను ఉపయోగించి నిజమైన, నకిలీ బంగారాన్ని కూడా గుర్తించవచ్చు. బంగారం అయస్కాంతాలకు అంటుకోదు. మీ బంగారం అయస్కాంతానికి అంటుకుంటే అది నకిలీదని అర్థం చేసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి