ఇంట్లో కూర్చుని రూ.15 లక్షలు గెలుచుకోండి.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏం చేయాలో తెలుసా?

మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేకంగా డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (డీఎఫ్‌ఐ) ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంట్లో కూర్చుని రూ.15 లక్షలు గెలుచుకోండి.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏం చేయాలో తెలుసా?
Money
Follow us
Venkata Chari

|

Updated on: Jul 29, 2021 | 6:35 AM

ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకోసం ప్రభుత్వం ఓ చక్కని అవకాశం తీసుకొచ్చింది. ఏకంగా రూ .15 లక్షలు గెలుకునే అవకాశం మీముందుంది. మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలు తెలుసుకోండి మరి. కేంద్ర బడ్జెట్ 2021 లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేకంగా డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (డీఎఫ్‌ఐ) ను రూపొందించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ) కింద 2024-25 నాటికి 7000 ప్రాజెక్టులకు సుమారు రూ .111 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని కేంద్రం యోచిస్తోంది.

మైగోవ్ ఇండియా ట్విట్టర్‌లో ఈమేరకు అధికారికంగా సమాచారం అందించింది. ఈ ప్రాజెక్టుల అమలు చేసేందుకు, అలాగే సకాలంలో పూర్తి చేసేందుకు చాలా నిధులు అవసరమవుతాయి. అయితే, కొత్తగా ప్రారంభించే ఈ సంస్థకు సంబంధించి లోగో, ట్యాగ్ లైన్‌తో పేరును సూచించాలని ప్రభుత్వ్ కోరింది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఆగస్టు 15, 2021 వరకు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఈ పోటీలో గెలిచిన వ్యక్తికి బహుమతిగా రూ .15 లక్షలు దాకా దక్కనున్నాయి. జస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే.. మీలో ఉన్న క్రియోటివిటికీ పదును పెట్టడమే.

పేరు, ట్యాగ్‌లైన్, లోగో అభివృద్ధి ఆర్థిక సంస్థ స్థాపించిన గల ఉద్దేశాన్ని సూచించేలా ఉండాటి. అంటే ఆ సంస్థ ఏమి చేయగలదు, చేస్తుందో అందులో స్పష్టంగా పేర్కొనాలి. మూడు పేర్లు, ట్యాగ్‌లైన్‌లు, లోగోలు విభిన్నంగా ఉండేలా చూడాలి.

ఇలా నమోదు చేసుకోవచ్చు ఈ పోటీలో పాల్గొనడానికి మీరు మొదట mygov.in పోర్టల్‌ను సందర్శించాలి. అందులో లాగిన్ టు పార్టిసిపేట్ టాబ్ పై క్లిక్ చేయాలి. దీని తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ తరువాత మీ ఎంట్రీని సమర్పించాలి.

బహుమతుల వివరాలు సంస్థ పేరు సూచించినందుకుగాను మొదటి బహుమతిగా రూ .5,00,000, రెండవ బహుమతిగా రూ .3,00,000, మూడవ బహుమతిగా రూ .2,00,000 అందనున్నాయి. అలాగే ట్యాగ్‌లైన్‌ సూచించినందుకుగాను మొదటి బహుమతిగా రూ .5,00,000, రెండవ బహుమతిగా రూ .3,00,000, మూడవ బహుమతిగా రూ .2,00,000 దక్కనున్నాయి. లోగో చేసినందుకు గాను మొదటి బహుమతిగా రూ .5,00,000, రెండవ బహుమతిగా రూ .3,00,000, మూడవ బహుమతిగా రూ .2,00,000 అందనున్నాయి.

Also Read: ICICI Bank Alert: ఐసీఐసీఐ అలర్ట్.. ఆగస్టు నుంచి మారనున్న సర్వీస్ ఛార్జీలు.. వివరాలు..

Tax Saving Tips: మీరు ట్యాక్స్ పేయర్లా.. అయితే ఇలా పన్ను మినహాయింపులు పొందండి..