AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Sucess Story: రతన్ టాటా సాయంతో 150 కోట్ల టర్నోవర్ స్థాయికి..ఓ అంధుడి సక్సెస్ స్టోరీ

Inspiring Sucess Story:ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం కూడా ఓడిపోతుంది. మనో సంకల్పం ఉంటె.. చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకోవచ్చు అని ఎందరో మహానుభావులు..

Inspiring Sucess Story: రతన్ టాటా సాయంతో 150 కోట్ల టర్నోవర్ స్థాయికి..ఓ అంధుడి సక్సెస్ స్టోరీ
Srikanth
Surya Kala
|

Updated on: Jun 18, 2021 | 11:52 AM

Share

Inspiring Sucess Story:ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం కూడా ఓడిపోతుంది. మనో సంకల్పం ఉంటె.. చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకోవచ్చు అని ఎందరో మహానుభావులు నిరూపించారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే శ్రీకాంత్ బొల్లా.. పుట్టుకతోనే అంధుడు.. కష్టపడి చదివితే ఐఐటి లో భారత దేశంలో సీటు ఇవ్వమని అంటే.. అమెరికా వెళ్లి మరీ చదువుకున్నాడు.. స్వయం కృషి పట్టుదలతో మంచి మార్కులతో పాస్ అయిన శ్రీకాంత్ ను అమెరికాలోని అనేక కంపెనీని వెదుకుతూ వచ్చాయి ఉద్యోగం ఇవ్వడానికి.. తన దేశం తనకు చదువుకునే వీలు ఇవ్వకపోయినా దేశం మీద ఉన్న మక్కువతో స్వదేశ బాట పట్టాడు. ఇక్కడ రతన్ టాటా ఇచ్చిన ఫండ్స్ తో ఓ కంపీనీ పెట్టు.. ఈరోజు ఎందరి అంధులకు ఉద్యోగాలను ఇచ్చి జీవితాన్ని ఇచ్చాడు అంతేకాదు 300 మంది విద్యార్థులను చదివిస్తున్నారు ఈ స్ఫూర్తి ప్రదాత గురించి తెలుసుకుందాం..

మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన శ్రీకాంత్ బొల్లా జన్మించాడు. శ్రీకాంత్ జననం అతని తల్లిదండ్రులను నిరాశ కలిగించింది. బాధ పడ్డారు కూడా ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కనుక. ఇక ఇరుగు పొరుగు ఐతే ఒక అడుగు ముందుకేసి ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు.

అప్పుడు తల్లిదండ్రుల మనసు స్పందించింది. తమ బిడ్డ ఎలా ఉన్నా తాము జీవించి ఉన్నంత వరకూ బాగా చూసుకొంటాం. తాము పోయాక దేవుడే చూసుకోవాలి ” అని అనేవారు. అయితే దేవుడు ఒకటి తీసుకుంటే.. అంతకు మించి గ్రహణ శక్తి ఇస్తాడేమో.. శ్రీకాంత్ చదువులో అందరికంటే చురుకుగా వుండేవాడు. పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అయితే ఇంటర్ లో నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని కాలేజీలు రిజెక్ట్ చేశాయి. అప్పుడు శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి మరీ కాలేజీలో సీటు సంపాదించాడు. అక్కడ తోటి స్టూడెంట్స్ చేసే ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు.

మళ్ళీ హైదరాబాద్ లో దివ్యంగుల కోసం ఉన్న ఓ స్కూల్ లో చేరాడు.. అక్కడకూడా పిల్లలు అవమానించడంతో చదువు మానేసి ఇంటి దారి పట్టాడు.. అప్పుడు ఒక టీచర్ శ్రీకాంత్ ను పట్టుకొని చెంపచెళ్ళుమనిపించింది. అక్కడే శ్రీకాంత్ జీవితం మలుపు తీసుకుంది. ఆ టీచర్ శ్రీకాంత్ కు ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ లోఎంపీసీ లో 98% మార్కులతో పాస్ అయ్యాడు. అప్పుడు శ్రీకాంత్ ను ఎగతాళి చేసినవారు అవాక్కయ్యారు. అయితే ఐఐటీ వారు సీటు ఇవ్వమన్నారు.

అయినా శ్రీకాంత్ నిరాశ చెందలేదు.. అమెరికాలో చదవానికి సంకల్పించుకున్నాడు. అక్కడ యూనివర్సిటీ లో జాయిన్ అవ్వడానికి ఎంట్రెన్స్ పరీక్ష రాశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ తో పాటు మరో రెండు ప్రముఖ యూనివర్సిటీలు కూడా శ్రీకాంత్ కు సీట్ ఇవ్వడానికి  ముందుకొచ్చాయి. శ్రీకాంత్ హార్వర్డ్ యూనివర్సిటీలో Brain Cognitive Sciences లోచేరారు. ఇక్కడ చేరిన తోలి అంధుడుగా చరిత్రకెక్కారు. శ్రీకాంత్ ప్రతిభ చూసి , చదువు ఐన తరువాత పలు అమెరికన్ కంపీనీలు తమదగ్గర వుద్యోగం చేయమని అడిగాయి. ఆ ఆఫర్స్ ను శ్రీకాంత్ సున్నితంగా తిరస్కరించారు.

శ్రీకాంత్ తిరిగి భారత దేశానికి వచ్చి హైదరాబాద్ దగ్గర Bollant Industries స్థాపించాలని వుందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అలా మొదలైన ఈ కంపీనీ ఈరోజు 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీగా ఎదిగింది. ఈ కంపెనీకి సాక్షాత్తూ అబ్దుల్ కలాం గారే వచ్చారు. శ్రీకాంత్ ను కలిసి సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాంత్, అబ్దుల్ కలాం లు కలిసి Lead India Project ద్వారా 4 లక్షలమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులు వుద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నారు. కంటి చూపు అనే చీకటి.. చదువు అనే కాంతితో నింపుకుని నేడు అనేక మందికి స్ఫూర్తివంతమైన వ్యక్తిగా నిలిచారు శ్రీకాంత్. చీకటి జీవితంలో వెలుగులు నింపుకోవడమే కాదు.. నాకు ఏముంది. ఈ దేశం నాకు ఏమి ఇచ్చింది అంటూ.. నిత్యం నిరాశావాదంతో మాట్లాడుతూ.. జీవించే వారికెందరికో మార్గదర్శి. ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ, దిశ నిర్దేశితాలు

Also Read: ఛాయ్ ప్రియుల కోసం చామంతి తీ తయారీ విధానం .. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం