Airtel New Plan: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. జియో ప్లాన్స్‌తో ఎయిర్‌టెల్ పోటీ
Airtel New Plan: ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.456 రీచార్జ్‌తో 60 రోజుల వ్యాలిడిటీ, 50 జీబీ డేటాను అందించనున్నారు...
Airtel New Plan: ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.456 రీచార్జ్‌తో 60 రోజుల వ్యాలిడిటీ, 50 జీబీ డేటాను అందించనున్నారు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. ఈ 50 జీబీ డేటా అయిపోయాక ప్రతి ఎంబీకి 50 పైసలు ఖర్చు కానున్నాయి. జియో రూ.447 ప్లాన్‌తో ఈ రూ.456 ప్లాన్ పోటీపడనుంది. ఈ జియో ప్లాన్ గతవారమే అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతోపాటు ఎయిర్ టెల్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది. ఎయిర్ టెల్ రూ.456 ప్రీపెయిడ్ ప్లాన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో లిస్ట్ అయింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్, గూగుల్ పే, పేటీయం వంటి యాప్స్‌లో కూడా ఈ రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మొబైల్ వీడియో ఎడిషన్ 30 రోజుల ట్రయల్‌ను కూడా అందించనున్నారు. దీంతోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్లు కూడా అందించనున్నారు.
రూ.456 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే.. రూ.100 ఫాస్టాగ్ క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నారు. దీంతోపాటు షా అకాడమీ ఆన్‌లైన్ క్లాసులకి కూడా ఉచిత యాక్సెస్ లభించనుంది. జియో రూ.447 ప్లాన్ తరహాలోనే ఎయిర్ టెల్ రూ.456 ప్లాన్ లాభాలు కూడా ఉన్నాయి.
జియో రూ.447 ప్లాన్ ద్వారా 50 జీబీ డేటాను అందించనున్నారు. ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లభించనుంది. దీంతోపాటు జియోటీవీ, జియోసినిమా, జియోన్యూస్, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ వంటి సర్వీసులకు ఉచిత యాక్సెస్ లభించనుంది.