Gautam Adani : గౌతమ్ అదానీకి బ్యాడ్ టైమ్..! ఈ వారం ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువగా డబ్బును కోల్పోయాడు..
Gautam Adani : ప్రస్తుతం గౌతమ్ అదానీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో వెనుకబడిపోయాడు.
Gautam Adani : ప్రస్తుతం గౌతమ్ అదానీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో వెనుకబడిపోయాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 58 ఏళ్ల ఈ వ్యాపారవేత్త ఈ వారంలో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ డబ్బును కోల్పోయాడు. అతని వ్యక్తిగత సంపద 13.2 బిలియన్ డాలర్ల నుంచి 63.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ గురువారం తగ్గుతూ వచ్చాయి. కొద్ది రోజుల క్రితం అతను ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీతో పోటీలో ఉన్నాడు. కానీ ఊహించని పరిస్థితు కారణంగా వెనుకబడిపోయాడు.
అల్బులా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఎపిఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అదానీ సంస్థల వాటాలు. అదానీ సమూహం వీటిని నిర్లక్ష్యంగా నిర్వహించడంతో భారీ మూల్యం చెల్లించాల్సివచ్చింది. పారదర్శకతపై ఆందోళన ఉన్న పెట్టుబడిదారులు నిష్క్రమణ కోసం క్యూ కట్టారు. దీంతో భారీ నష్టం ఏర్పడింది. మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్స్ వారి ఆస్తులలో 90% కంటే ఎక్కువ అదానీ గ్రూప్ కంపెనీల నిర్వహణలో ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపింది.
మార్చిలో గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్-1, నెంబర్ -2 స్థానాల్లో కొనసాగుతున్న అమెరికా దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లను బీట్ చేశారు. అప్పుడు అదానీకి గ్రూప్స్‌కు చెందిన ఎనర్జీ, పవర్, ట్రాన్స్మిషన్, ఎంటర్ ప్రైజెస్, గ్యాస్, పోర్ట్స్, సెజ్ మొదలగు రంగాల్లో సంపద 90 శాతం పెరిగినట్లు బ్లూ బర్గ్ తెలిపింది. కరోనా వ్యాప్తి కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నా.. మరోవైపు భారతీయ బిలియనీర్లు మరింత సంపన్నులయ్యారు. కరోనాను కూడా వారికి అనుకూలంగా మార్చుకొని లాభాలను గడించారు.