AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump Comments: భారత్‌లో కొవిడ్ సంక్షోభంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ 19 వ్యాప్తికి చైనాయే కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. కరోనా వల్ల భారత్‌ సర్వనాశనమైందని అన్నారు..

Donald Trump Comments: భారత్‌లో కొవిడ్ సంక్షోభంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump
Subhash Goud
|

Updated on: Jun 18, 2021 | 11:52 AM

Share

Donald Trump: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ 19 వ్యాప్తికి చైనాయే కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. కరోనా వల్ల భారత్‌ సర్వనాశనమైందని అన్నారు. పాక్స్‌న్యూస్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యాలు చేశారు. కరోనా వ్యాప్తికి బాధ్యత వహిస్తున్న చైనా అమెరికాకు రూ.742,32,600 కోట్లు (10 ట్రిలియన్‌ డాలర్లు) చెల్లించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. నిజానికి చైనా ప్రపంచానికి చాలా ఎక్కువే చెల్లించాలని, అయితే దాని సామర్థ్యం ఇంతేనని చెప్పారు. వారు చేసిన చర్యల వల్ల చాలా దేశాలు నాశనమయ్యాయని ఆరోపించారు. ప్రజారోగ్యం విషయంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు ట్రంప్‌.

కరోనా మహమ్మారి చైనాలో పుట్టిందని, చైనాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని గతంలో డిమాండ్‌ చేసిన ట్రంప్‌.. మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు మిలియన్లకుపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే చైనా ప్రయోగశాల నుంచి వైరస్‌ బయటపడిందని ట్రంప్‌ పలు సందర్భాలలో ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నష్టపోయిన దేశాలలో ఒకటిగా భారత్ అని, ఏప్రిల్‌- మే నెలల్లో కోవిడ్‌ భారత్‌ను తీవ్ర స్థాయిలో కుదిపేసిందన్నారు. కాగా, ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇస్తున్నాయి. డిసెంబర్‌ 2021 నాటికి దేశం మొత్తం జనాభాకు టీకాలు వేస్తామని ఇప్పటికే భారత్‌ ప్రకటించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చైనాలో పర్యటించి కరోనాపై వాస్తవాలను బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు. చైనా పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి చైనాపై డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ఆరోపణలు గుప్పించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కూడా చైనాలోని వూహాన్‌లో పర్యటించి కరోనా పుట్టుకపై ఆరా తీశారు. ఇక సెకండ్‌వేవ్‌లో భారత్‌ను మరింత కుంగదీసిన కరోనా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. ఫస్ట్‌ వేవ్‌లో కంటే సెకండ్‌ వేవ్‌ భారత్‌ తీవ్ర స్థాయిలో వ్యాపించింది.

ఇవీ కూడా చదవండి:

Helmet: మెదడు పని తీరును తెలుసుకునే హెల్మెట్‌.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ

Naftali Bennett: రాజకీయ గురువునే కుర్చీ నుంచి దింపి ఇజ్రాయిల్ లో సంకీర్ణ ప్రభుత్వ సారథిగా నాఫ్తాలి బెన్నెట్

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..