AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Crisis: పెట్రోల్‌ లేదు.. ఆఫీసులకు రావద్దు! ఇంటి నుంచే..

పెట్రోల్‌ బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనదారులు 10 గంటలకు మించి లైన్లలో వేచివుంటున్నారు. ప్రభుత్వ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టుకు సరిపడా పెట్రోల్‌ లేనందున..

Sri Lanka Crisis: పెట్రోల్‌ లేదు.. ఆఫీసులకు రావద్దు! ఇంటి నుంచే..
Srilanka Crisis
Srilakshmi C
|

Updated on: Jun 18, 2022 | 12:14 PM

Share

petrol shortage sri lanka: శ్రీలంక ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారిపోతోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులను రెండు వారాల పాటు వర్క్‌ ఫ్రం హోం చేయాలని శ్రీలంక ప్రభుత్వం ఆదేశించింది. పెట్రోల్‌ కొరత కారణంగా అక్కడి ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం (జూన్‌ 17) ఆజ్ఞలు షురూ చేసింది. దాదాపు ఏడు దశాబ్ధాల తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కూరుకుపోయింది. పెట్రోల్‌ బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనదారులు 10 గంటలకు మించి లైన్లలో వేచివుంటున్నారు. ప్రభుత్వ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టుకు సరిపడా పెట్రోల్‌ లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అడుగంటుకున్న ఇంధన నిల్వలు లంక పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇందన నిల్వలు ఇంకొన్ని రోజుల్లో అడుగంటుకోనున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ దిగుమతుల కోసం శ్రీలంక అష్టకష్టాలు పడుతోంది. ప్రభుత్వ దుర్వినియోగం, కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా శ్రీలంక అగచాట్లు పడుతోంది.

1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఎన్నడూ చవిచూడని విధంగా మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ, ఆరోగ్య విభాగం మినహా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవల్సిందిగా ఆజ్ఞలు జారీ చేసింది. ఇంధన సరఫరాపై తీవ్రమైన పరిమితులు, బలహీన ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేట్ వాహనాల వినియోగంపై ఇబ్బందులు తలెత్తడంతో అవసరమైన సిబ్బంది మాత్రమే సోమవారం నుంచి కార్యాలయాలకు వెళ్లాలని తెలుపుతూ సర్క్యులర్ జారీ చేసింది. సుమారు పది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో, ఆరోగ్య సంరక్షణ వంటి ముఖ్యమైన సేవలను అందించే సిబ్బంది మాత్రమే విధులకు హాజరుకావాలని సర్క్యులర్‌లో పేర్కొంది. వీరితోపాటు అన్ని పాఠశాలలను సోమవారం నుంచి రెండు వారాలపాటు మూసివేస్తున్నట్లు తెల్పింది. విద్యార్ధులందరికీ ఆన్‌లైన్‌ క్లాసులు బోధించాలని విద్యా మంత్రిత్వ శాఖ కోరింది.

పబ్లిక్‌ సెక్టార్‌ వర్కర్లకు వారానికి నాలుగు రోజుల పనిదినాలను కేటాయించి, మిగిలిన రోజుల్లో ఆహార పంటల ఉత్పత్తికి పనిచేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాబోయే నాలుగు నెలల్లో సంక్షోభం మరింత తీవ్రతరం అవుతుందని, 1.7 మిలియన్ల శ్రీలంక పౌరులకు సహాయం అందించేందుకు 47 మిలియన్ డాలర్లు సేకరించే పనిలో ఐక్యరాజ్యసమితి ఉన్నట్లు వివరించింది. రాబోయే రోజుల్లో దాదాపు 5 మిలియన్ల శ్రీలంక వాసులు ఆహార కొరతతో ప్రత్యక్షంగా ప్రభావితులవుతారని ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.