HDFC Bank: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు శుభవార్త.. వారంలో రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ..

ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వారం వ్యవధిలో రెండోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది...

HDFC Bank: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు శుభవార్త.. వారంలో రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ..
HDFC
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 18, 2022 | 12:08 PM

ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వారం వ్యవధిలో రెండోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూన్ 17, 2022 నుంచి రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంతో వివిధ కాలాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెంచిన కొత్త వడ్డీ రేట్లు అమలు చేస్తోంది. అయితే, HDFC బ్యాంక్ కూడా NRO, NRE ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం కొన్ని విషయాలను స్పష్టం చేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి అందిన సమాచారం ప్రకారం, సీనియర్ సిటిజన్‌లకు ఇచ్చే ప్రయోజనం ఎన్నారైలు చేసే ఎఫ్‌డిలపై అందుబాటులో ఉండదు. వ్యవధి 2 కోట్ల కంటే తక్కువ

2 కోట్ల కంటే తక్కువ
వ్యవధి వడ్డీ రేటు (సాధారణ పౌరులకు) వడ్డీ రేటు (సీనియర్ సిటిజన్లకు)
7-14 రోజులు 2.75% 3.25%
15-29 రోజులు 2.75% 3.25%
30-45 రోజులు 3.25% 3.75%
46-60 రోజులు 3.25% 3.75%
61 – 90 రోజులు 3.25% 3.75%
91 రోజులు – 6 నెలలు 3.75% 4.25%
6 నెలలు 1 రోజు – 9 నెలలు 4.65% 5.15%
9 నెలలు 1 రోజు < 1 సంవత్సరం 4.65% 5.15%
1 సంవత్సరం 5.35% 5.85%
1 సంవత్సరం 1 రోజు – 2 సంవత్సరాలు 5.35% 5.85%
2 సంవత్సరాల 1 రోజు – 3 సంవత్సరాలు 5.50% 6.00%
3 సంవత్సరాలు 1 రోజు – 5 సంవత్సరాలు 5.70% 6.20%
5 సంవత్సరాలు 1 రోజు – 10 సంవత్సరాలు 5.75% 6.50%*
ఇవి కూడా చదవండి

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఎఫ్‌డిలపై 5.35 శాతం వడ్డీని ఇస్తోంది. అయితే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల ఎఫ్‌డిలపై 5.50 శాతం వడ్డీని ఇస్తోంది. ఇది 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల FDలపై 5.70 శాతం, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల FDలపై 5.75 శాతం వడ్డీని ఇస్తోంది. దేశంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లకు సాధారణ పౌరులతో పోలిస్తే 0.50 శాతం అదనపు వడ్డీని ఇస్తున్నట్లు పేర్కొంది. జూన్ 8న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచినప్పటి నుంచి దేశంలోని అన్ని బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించడానికి మునుపటి కంటే FD, RD, సేవింగ్స్ ఖాతాలపై ఎక్కువ వడ్డీని చెల్లించడం ప్రారంభించాయి. అయితే, చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై అందించే వడ్డీ రేట్లను మార్చలేదు.