AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Fraud Insurance: సైబర్‌ దాడుల నుంచి రక్షణకు ప్రత్యేక ఇన్సూరెన్స్‌.. ఆర్థిక భద్రతే ప్రధాన లక్ష్యం

ఇటీవల కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ సాధారణ ప్రజలకు పెద్ద తలనొప్పులు తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా అందరూ తమ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోనే ఉంచుకోవడంతో ఆ సొమ్మును తస్కరించేందుకు సైబర్‌ నేరగాళ్లు సతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్ బెదిరింపులు ఇటీవల కాలంలో వ్యక్తులతో పాటు సంస్థలకు ఎక్కువయ్యాయి. మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు మరింత డిజిటలైజ్ అయినందున ఆన్‌లైన్ నేరాలకు బలి అయ్యే అవకాశం విపరీతంగా ఉంటుంది.

Cyber Fraud Insurance: సైబర్‌ దాడుల నుంచి రక్షణకు ప్రత్యేక ఇన్సూరెన్స్‌.. ఆర్థిక భద్రతే ప్రధాన లక్ష్యం
Cyber Crime
Nikhil
|

Updated on: Aug 26, 2024 | 7:42 PM

Share

ఇటీవల కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ సాధారణ ప్రజలకు పెద్ద తలనొప్పులు తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా అందరూ తమ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోనే ఉంచుకోవడంతో ఆ సొమ్మును తస్కరించేందుకు సైబర్‌ నేరగాళ్లు సతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్ బెదిరింపులు ఇటీవల కాలంలో వ్యక్తులతో పాటు సంస్థలకు ఎక్కువయ్యాయి. మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు మరింత డిజిటలైజ్ అయినందున ఆన్‌లైన్ నేరాలకు బలి అయ్యే అవకాశం విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీ అర్థం చేసుకోలేని వారిని లక్ష్యంగా చేసుకుని స్కామర్లు రెచ్చిపోతున్నారు. అయితే ప్రాణాలకు, వాహనాలకు బీమా ఉన్నట్లే సైబర్ మోసం నుంచి తప్పించుకోవడానికి కూడా బీమా ఉందని చాలా మందికి తెలియదు. ఈ బీమా తీసుకోవడం ద్వారా ఆర్థిక రక్షణతో పాటు డిజిటల్ ప్రమాదాలను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్‌ పథకం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఓ సారి తెలుసుకుందాం.

ఆర్థిక రక్షణ

ముఖ్యంగా సైబర్‌ నేరగాళ్లు మన బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము తస్కరిస్తే సైబర్‌ బీమా ద్వారా ఆర్థిక రక్షణను పొందచ్చు. ముఖ్యంగా ఆర్థిక నష్టాలను తగ్గించడంతో పాటు సైబర్ బీమా ద్వారా అనుకోని ఆర్థిక ప్రమాదాల నుంచి గట్టెక్కవచ్చు. 

సైబర్‌ మోసం గుర్తింపు

చాలా మంది సైబర్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు ఇప్పుడు సైబర్‌ మోసం నివారణతో పాటు ముందస్తు ముప్పును గుర్తించడం కోసం అధునాతన సాధనాలను అందిస్తున్నారు, ఇది కేవలం ఆర్థిక రక్షణకు మించి విస్తరించింది. వీటిలో ఏఐ-ఆధారిత కాల్ స్క్రీనింగ్, అధునాతన స్పామ్ గుర్తింపుతో పాటు అనుమానాస్పద కార్యకలాపాల కోసం రియల్‌ టైమ్‌ హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ముఖ్యంగా బీమా తీసుకున్న వారిని హెచ్చరించేందుకు ఈ సైబర్‌ బీమా చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫీచర్లు సైబర్ ఇన్సూరెన్స్‌ను రియాక్టివ్ సేఫ్టీ నెట్ నుంచి ప్రోయాక్టివ్ షీల్డ్‌గా మారుస్తాయి.

ఇవి కూడా చదవండి

సమగ్ర చట్టపరమైన మద్దతు

సైబర్ మోసాలు గురైనప్పుడు చట్టపరమైన సవాళ్లు చాలా చికాకు తెప్పిస్తాయి. సైబర్ బీమా పాలసీలు తరచుగా డేటా ఉల్లంఘనలు, గోప్యతా ఉల్లంఘనలుతో ఇతర సైబర్ సంబంధిత చట్టపరమైన విషయాలకు సంబంధించిన చట్టబద్ధ సమస్యలను కూడా కవర్ చేస్తాయి. 

వ్యాపార కొనసాగింపు హామీ

వ్యాపార ప్రపంచంలో డౌన్‌టైమ్‌లు వినాశకరంగా ఉంటాయి. సైబర్-దాడులు గణనీయమైన కార్యాచరణ అంతరాయాలతో పాటు ఆదాయ నష్టానికి దారి తీయవచ్చు. తరచుగా వేగవంతమైన డేటా రికవరీ, సిస్టమ్ పునరుద్ధరణ, మొత్తం వ్యాపార కొనసాగింపును సులభతరం చేయడం ద్వారా ఈ ప్రభావాన్ని తగ్గించడంలో సైబర్ బీమా కీలక పాత్ర పోషిస్తుంది.

సైబర్ రెసిలెన్స్

ఆర్థిక రక్షణకు అతీతంగా కొన్ని సైబర్ బీమా పాలసీలు సైబర్‌ సెక్యూరిటీని పెంచడానికి చురుకైన చర్యలను అందిస్తాయి. వీటిలో సాధారణ భద్రతా అంచనాలు, శిక్షణ కార్యక్రమాలు, విశ్లేషణలు ఉండవచ్చు. రక్షణాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు బీమా పొందిన వారు భవిష్యత్తులో సైబర్ మోసాలకు గురికాకుండా ఉండవచ్చు.