Mini Refrigerator: చిన్న ఫ్రిడ్జ్.. ఎక్కువ ఫీచర్స్.. బ్యాచిలర్స్‌కి భలే ఉపయోగపడుతుంది..

ఇటీవల కాలంలో మినీ రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇంట్లో చాలా తక్కువ స్పేస్ ఉన్న వారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అటువంటి వారు ఈ మినీ రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తున్నారు. అలాగే బయట రూమ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు, ఒంటరిగా ఉద్యోగాల చేసుకునే బ్యాచిరల్స్ కూడా ఇవి బాగా ఉపయుక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ఫీచర్లు, గుడ్ లుకింగ్ డిజైన్, తక్కువ ఇంధనం తీసుకొనే మినీ రిఫ్రిజిరేట్ల జాబితాను మీకు అందిస్తున్నాం.

Mini Refrigerator: చిన్న ఫ్రిడ్జ్.. ఎక్కువ ఫీచర్స్.. బ్యాచిలర్స్‌కి భలే ఉపయోగపడుతుంది..
Mini Refrigerator
Follow us
Madhu

|

Updated on: Sep 21, 2023 | 2:44 PM

ప్రస్తుతం రిఫ్రిజిరేటర్ అనేది ప్రాధాన్య అవసరం అయిపోయింది. ప్రతి ఇంట్లోనూ ఉండాలని కోరుకుంటున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాటిని కొనుగోలు చేస్తుంటారు. రిఫ్రిజిరేటర్లలో చాలా రకాలు, మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ డోర్, డబుల్ డోర్, ఫోర్ డోర్ లతో పాటు అనే స్మార్ట్ ఫీచర్లతో కూడిన రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. అయితే వాటి సైజ్ మాత్రం వాటి సామర్థ్యంతో పాటు పెరిగిపోతుంది. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో మినీ రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇంట్లో చాలా తక్కువ స్పేస్ ఉన్న వారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అటువంటి వారు ఈ మినీ రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తున్నారు. అలాగే బయట రూమ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు, ఒంటరిగా ఉద్యోగాల చేసుకునే బ్యాచిరల్స్ కూడా ఇవి బాగా ఉపయుక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ఫీచర్లు, గుడ్ లుకింగ్ డిజైన్, తక్కువ ఇంధనం తీసుకొనే మినీ రిఫ్రిజిరేట్ల జాబితాను మీకు అందిస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..

గోద్రేజ్ 45 లీటర్ల 2 స్టార్ మినీ బార్ రిఫ్రిజిరేటర్.. ఇది చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. ముఖ్యంగా బ్యాచిలర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇది డైరెక్ట్ కూలింగ్ ఫీచర్ తో వస్తుంది. 45 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. ఐదేళ్ల కంప్రెషర్ వారంటీ ఉంటుంది. అడ్జస్టబుల్ థర్మోస్టాట్ ఉంటుంది. మూడు మోడ్లు మినిమమ్, మీడియం, మ్యాక్సిమ్ ఉంటాయి. లార్జ్ బాటిల్ స్పేస్ ఉంటుంది. ప్రత్యేకమైన అదనపు కూల్ జోన్, సౌండ్ లెస్ ఆపరేషన్ ఉంటుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ఫారంలో రూ. 12, 450గా ఉంది.

హైసెన్స్ 45 లీటర్ 4 స్టార్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్.. దీనిలో రెండు లీటర్ల బాటిల్స్ పెట్టుకోడానికి ప్రత్యేకమైన బాటిల్ బిన్ ఉంటుంది. చిల్లర్ జోన్ ఉంటుంది. దీనిలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఉంచుకోవచ్చు. 10ఏళ్ల కంప్రెషన్ వారంటీ, ఒక సంవత్సరం పాటు ఫ్రిడ్జ్ పై వారంటీ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 8,490గా ఉంది.

ఇవి కూడా చదవండి

గోద్రేజ్ 30ఎల్ క్యూబ్ పర్సనల్ స్టాండర్డ్ సింగిల్ డోర్ కూలింగ్ సొల్యూషన్.. దీని డిజైన్, లుక్ అంతా కూడా కొత్తగా ఉంటుంది. ఇది హాస్టళ్లు, చిన్న ఇల్లు, ఆఫీసుల అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. కూలింగ్ కెపాసిటీ 8 డిగ్రీల నుంచి 10డిగ్రీల వరకూ ఉంటుంది. డీ ఫ్రాస్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సౌండ్ లెస్ ఆపరేషన్ ఉంటుంది. దీనిలో కంప్రెషర్ ఉండదు. ఈ ఉత్పత్తి పై ఒక సంవత్సంర వారంటీ ఉంటుంది. 30 లీటర్ల సామర్థ్యంతో ఇది వస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 7.790గా ఉంది.

ట్రోపి కూల్ పోర్టాచిల్ బ్లాక్ 5ఎల్ కార్ రిఫ్రిజిరేటర్ చిల్లర్ కమ్ వార్మర్.. ఈ సరికొత్త కార్ రిఫ్రిజిరేటర్ రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు. కూలింగ్ అలాగే వేడి చేసుకోవడానికి కూడా వాడొచ్చు. ఇది రోడ్ ట్రిప్పులకు , అవుట్ డోర్ అడ్వెంచర్స్ చేసుకునేందుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో టెంపరేచర్ ఐదు డిగ్రీల నుంచి 60 డిగ్రీల వరకూ అడ్జస్ట్ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇది ఏసీ, డీసీ పవర్ సప్లై పై పనిచేస్తుంది. దీనిపై ఏడాది పాటు వారంటీ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 4949గా ఉంది.

కెల్వినేటర్ 45 లీటర్ 1 స్టార్ మినీ బార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్.. ఈ ఫ్రిడ్జ్ లో రిమూవబుల్ రబ్బర్ స్ట్రిప్ ఉంటుంది. దీనిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. దీనిలో ఆర్600ఏ రిఫ్రిజిరెంట్ గ్యాస్ ఉంటుంది. సింగిల్ స్టార్ రేటింగ్ తో వస్తుంది. పెద్ద ఇళ్లకు ఇది సరిపడదు. దీని సామర్థ్యం 45 లీటర్లు ఉంటుంది. తక్కువ స్పేస్ ఉండే ఇళ్లకు సరిగ్గా సరిపోతోంది. దీని ధర అమెజాన్ లో రూ. 9,490గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?