Ice Cream GST: ఐస్ క్రీమ్‌ పాల ఉత్పత్తి కాదు.. 18 శాతం పన్ను: జీఎస్టీ అథారిటీ

మృదువైన, క్రీమ్‌ ప్రోడక్ట్‌ను రూపొందించడంలో ప్రతి ముడి పదార్థానికి నిర్దిష్ట పాత్ర ఉందని ఏఏఆర్‌ గుర్తించింది. ఇంకా ఉత్పత్తి పదార్థాలు మాత్రమే కాకుండా, 'సాఫ్ట్ సర్వ్' అంటే ఐస్ క్రీం మేకింగ్ మెషిన్‌లో చేసిన ప్రాసెసింగ్ కూడా 'సాఫ్ట్ సర్వ్'కి మృదువైన క్రీమ్‌..

Ice Cream GST: ఐస్ క్రీమ్‌ పాల ఉత్పత్తి కాదు.. 18 శాతం పన్ను: జీఎస్టీ అథారిటీ
Follow us
Subhash Goud

|

Updated on: Oct 22, 2024 | 7:21 PM

మీకు వెనీలా సాఫ్ట్‌ ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టమైతే ఈ వార్త మీకోసమే. రాజస్థాన్‌కు చెందిన అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) వెనీలా ఫ్లేవర్డ్ సాఫ్ట్ ఐస్ క్రీం ‘మిక్స్’ పాల ఉత్పత్తి కాదని తెలిపింది. దీనిపై 18% జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. పౌడర్ రూపంలో వెనీలా మిశ్రమంపై పన్ను విధించే విషయంలో కంపెనీ Authority of Advance Ruling (AAR)ని సంప్రదించింది. దీనిపై ఏఏఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. VRB కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉత్పత్తికి సంబంధించి, ఇందులో 61.2 శాతం చక్కెర, 34 శాతం స్కిమ్డ్ మిల్క్ పౌడర్, 4.8 శాతం రుచి పెంచే పదార్థాలు, ఉప్పుతో సహా ఇతర పదార్థాలు ఉన్నాయని పేర్కొంది.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్.. 160 రోజుల వ్యాలిడిటీతో..

మృదువైన, క్రీమ్‌ ప్రోడక్ట్‌ను రూపొందించడంలో ప్రతి ముడి పదార్థానికి నిర్దిష్ట పాత్ర ఉందని ఏఏఆర్‌ గుర్తించింది. ఇంకా ఉత్పత్తి పదార్థాలు మాత్రమే కాకుండా, ‘సాఫ్ట్ సర్వ్’ అంటే ఐస్ క్రీం మేకింగ్ మెషిన్‌లో చేసిన ప్రాసెసింగ్ కూడా ‘సాఫ్ట్ సర్వ్’కి మృదువైన క్రీమ్‌ ఆకృతిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Diwali Offer: ఈ ఫోన్‌లపై భారీ తగ్గింపు.. Samsung Galaxy S23 Ultra మొబైల్‌పై 50 శాతం డిస్కౌంట్‌

జీఎస్టీ చట్టం ప్రకారం, ప్రాసెసింగ్ ద్వారా మానవ వినియోగానికి తయారు చేసిన ఆహారం 18 శాతం పన్ను వర్తిస్తుందని తెలిపింది. ఇది కాకుండా, పాలపొడి, చక్కెర, ఏదైనా ఇతర అదనపు పదార్థాలు, జెల్లీ, ఐస్ క్రీం, ఇలాంటి తయారీలపై కూడా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ ఉత్పత్తిని పాల ఉత్పత్తి అని పిలవలేమని అధికార యంత్రాంగం తెలిపింది. తద్వారా వెనిలా ఫ్లేవర్‌లో ఉండే డ్రై సాఫ్ట్‌ ఐస్‌క్రీమ్‌ (తక్కువ కొవ్వు) ఉత్పత్తి ‘వెనిలా మిక్స్‌’పై 18 శాతం జిఎస్‌టి వర్తిస్తుందని తెలిపింది.

ఇది కూడా చదవండి: Diwali Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దీపావళికి 4 నాలుగు రోజుల సెలవులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!