AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Offer: ఈ ఫోన్‌లపై భారీ తగ్గింపు.. Samsung Galaxy S23 Ultra మొబైల్‌పై 50 శాతం డిస్కౌంట్‌

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో దీపావళి సేల్‌ కొనసాగుతోంది. పండగ సందర్భంగార వివిధ స్మార్ట్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ అందిస్తున్నాయి. ప్రీమియం మొబైల్స్‌పై భారీ తగ్గింపులతో అందిస్తున్నాయి. తక్కువ ధరతో, తక్కువ ఈఎంఐ ఆప్షన్‌లలో అందిస్తున్న స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం..

Diwali Offer: ఈ ఫోన్‌లపై భారీ తగ్గింపు.. Samsung Galaxy S23 Ultra మొబైల్‌పై 50 శాతం డిస్కౌంట్‌
Subhash Goud
|

Updated on: Oct 22, 2024 | 4:48 PM

Share

దీపావళి సందర్భంగా iPhone, Samsung, OnePlus వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లను నెలవారీ EMI రూ. 4 వేల కంటే తక్కువ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై మీరు మీకు నచ్చిన ఈఎంఐ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు. కొన్ని ఫోన్లలో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఆఫర్‌లు, ఈఎంఐ ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.

ఆపిల్ ఐఫోన్ 15:

ఆపిల్ ఇటీవల ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. దీనితో పాటు, మునుపటి మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. Apple iPhone 15 (128GB బ్లూ) ధర రూ.79,600. కానీ మీరు అమెజాన్ నుండి 12 శాతం తగ్గింపుతో కేవలం రూ. 69,900 మాత్రమే కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించకూడదనుకుంటే మీరు EMIలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీన్ని కొనుగోలు చేసినప్పుడు మీరు రూ.3,389 ప్రారంభ ఈఎంఐతో చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీ ఈఎంఐ కూడా మీరు ఎంత డౌన్ పేమెంట్ చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

OnePlus Nord CE4 Lite

మీరు ఈ ఫోన్‌ని Amazonలో 5 శాతం తగ్గింపుతో కేవలం రూ. 19,998కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ఫోన్‌ని నెలవారీ ఈఎంఐలో కొనుగోలు చేయాలనుకుంటే దానిపై నెలవారీ ఈఎంఐ రూ. 970 (ప్రారంభం). ఇది కాకుండా ప్లాట్‌ఫారమ్‌లో ఈఎంఐపై ఎటువంటి వడ్డీ రేటు చెల్లించాల్సిన అవసరం లేదు.

Samsung Galaxy S23 Ultra

ఈ Samsung ఫోన్ అసలు ధర రూ.1,49,999. కానీ మీరు ఈ ఫోన్‌ను 49 శాతం తగ్గింపుతో కేవలం రూ.75,999తో కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు నెలవారీ ఈఎంఐ కేవలం రూ.3,685 చెల్లించాలి. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై రూ.25,700 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి