AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దీపావళికి 4 నాలుగు రోజుల సెలవులు!

దసరా సెలవుల్లో ఎంజాయ్‌ చేసిన విద్యార్థులు.. ఇప్పుడు దీపావళి పండగ సెలవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దీపావళి పండగకు వరుస సెలవులు రానున్నాయి. ఈ పండగను అక్టోబర్‌ 31న నిర్వహించనున్నారు. ఈ దీపావళి పండగను కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు నిర్వహిస్తుంటే..మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు..

Diwali Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దీపావళికి 4 నాలుగు రోజుల సెలవులు!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 23, 2024 | 5:36 PM

పాఠశాల విద్యార్థులకు దీపావళి పండగకు వరుస సెలవులు రానున్నాయి. దసరా పండగకు దాదాపు 13 రోజుల పాటు సెలవులు ప్రకటించిన విద్యాసంస్థలు ఇప్పుడు దీపావళికి కూడా వరుస సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మళ్లీ మరో నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయని ఆనందపడుతున్నారు విద్యార్థులు. వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే దీపావళికి నాలుగు రోజులు అని మురిసిపోకండి దీపావళికి ఒకరోజు మాత్రమే సెలవు. దీపావళి పండగ అక్టోబర్ 31న (గురువారం) నిర్వహించనున్నారు. ఇంటిళ్లి పాది ఆనందోత్సహాలతో జరుపుకునే ఈ పండుగ కోసం విద్యార్థులు, కుటుంబ సభ్యులు తమతమ సొంతూళ్లకు వెళ్తుంటారు. సాధారణంగా దీపావళి పండగను మూడు రోజుల పాటు నిర్వహిస్తుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు నిర్వహిస్తుంటారు.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్.. 160 రోజుల వ్యాలిడిటీతో..

సీఎం ఉత్తర్వులు జారీ

గురువారం దీపావళి పండగ, శుక్రవారం పనిదినం కావడంతో ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి రావడానికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు సీఎం స్టాలిన్ శుక్రవారం కూడా అంటే నవంబర్ 1 న సెలవు రోజుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శని, ఆదివారాల్లో సెలవు కావడంతో పండుగకు వరుసగా నాలుగు రోజులు సెలవులు లభించనున్నాయి. గురు, శుక్రవారం సెలవులతో పాటు శని, ఆదివారాలు కలిసి వచ్చాయి. దీంతో నాలుగు రోజుల పాటు సెలవులు. మరి తమిళనాడు ప్రభుత్వం లాగానే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సెలవులు ప్రకటిస్తే ఈ విద్యార్థులకు కూడా నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 31న దీపావళి సెలవు ప్రకటించినప్పటికీ. నవంబర్‌ 1న కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Diwali Offer: ఈ ఫోన్‌లపై భారీ తగ్గింపు.. Samsung Galaxy S23 Ultra మొబైల్‌పై 50 శాతం డిస్కౌంట్‌

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి