AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sensex: జీడీపీ పెరుగుదల.. జీఎస్టీ కలెక్షన్ల వృద్ధి..లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..

ఒకవైపు జీడీపీ పెరుగుదల.. మరోవైపు జీఎస్టీ కలెక్షన్లలో వృద్ధి.. ఈరోజు స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీకి కారణం అయ్యాయి.

Sensex: జీడీపీ పెరుగుదల.. జీఎస్టీ కలెక్షన్ల వృద్ధి..లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..
Sensex
KVD Varma
|

Updated on: Dec 01, 2021 | 4:57 PM

Share

Sensex: ఒకవైపు జీడీపీ పెరుగుదల.. మరోవైపు జీఎస్టీ కలెక్షన్లలో వృద్ధి.. ఈరోజు స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీకి కారణం అయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) సెన్సెక్స్ 620 పాయింట్లు (1.09%) లాభపడి 57,684 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 183 పాయింట్లు (1.08%) పెరిగి 17,167 వద్ద ముగిసింది.

మార్కెట్‌ 620 పాయింట్లు లాభం..

ఈరోజు సెన్సెక్స్ 620 పాయింట్లు (1.09%) లాభపడి 57,684 వద్ద ముగిసింది. పగటిపూట గరిష్టంగా 57,846 పాయింట్లకు చేరుకుంది. ఒకదశలో కనిష్ట స్థాయి 57,346ని చూసింది. టాప్ 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 8 స్టాక్స్ క్షీణతలో ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవి డాక్టర్ రెడ్డి, అల్ట్రాటెక్, సన్ ఫార్మా, ఎయిర్‌టెల్, టైటాన్, కోటక్ బ్యాంక్. లాభాలతో 22 షేర్లు ముగిశాయి. ఇందులో ఇండస్‌ఇండస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, నెస్లే మొదలైనవి ఉన్నాయి.

మార్కెట్ క్యాప్ 259 లక్షల కోట్లు దాటింది

లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.259 లక్షల కోట్లకు పైగా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.2.5 లక్షల కోట్లు పెరిగింది. నిన్నటి జిడిపి గణాంకాలు, నేడు జిఎస్‌టి గణాంకాల పెరుగుదల ప్రభావం మార్కెట్‌పై ప్రత్యక్షంగా కనిపించింది. నిరంతర క్షీణతలో ఉన్న స్టాక్ మార్కెట్ ఈ కారణాల వల్ల ఈరోజు చాలా ఊపందుకుంది.

నిఫ్టీ 17,167 పాయింట్ల వద్ద..

మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) నిఫ్టీ 183 పాయింట్లు (1.08%) పెరిగి 17,167 వద్ద ముగిసింది. రోజులో ఎగువ స్థాయి 17,213.. దిగువ స్థాయి 17,064 వద్ద రికార్డ్ అయింది. నిఫ్టీ బ్యాంక్, మిడ్ క్యాప్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. దాని 50 షేర్లలో 35 లాభాలతో ముగియగా, 14 షేర్లు క్షీణించాయి. టాటా మోటార్స్, అదానీ పోర్ట్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. సిప్లా, దివీస్ ల్యాబ్, ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ముగిశాయి.

అంతకుముందు నిన్న, స్టాక్ మార్కెట్ విపరీతమైన ఒడిదుడుకులతో ముగిసిన విషయం తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) సెన్సెక్స్ రోజులో 923 పాయింట్ల వరకు పెరగగా, అది 1,316 పాయింట్ల వరకు పడిపోయింది. చివరకు 195 పాయింట్లు (0.34%) క్షీణించి 57064 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 82 పాయింట్లు నష్టపోయి 16,972 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి: Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

GST Collections: జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. నవంబర్ నెలలో టాక్సుల రూపేణా ఎంత వచ్చిందంటే..