AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: సీనియర్ సిటిజన్లకు గుడ్‌ న్యూస్.. ఆ పథకంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి..

సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్‌డీఏ) తీపికబురు అందించింది. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా జాతీయ ఫించను పథకం (ఎన్పీఎస్‌) ఖాతాను తెరిచే..

Good News: సీనియర్ సిటిజన్లకు గుడ్‌ న్యూస్.. ఆ పథకంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి..
Nps
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 15, 2022 | 12:33 PM

సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్‌డీఏ) తీపికబురు అందించింది. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా జాతీయ ఫించను పథకం (ఎన్పీఎస్‌) ఖాతాను తెరిచే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో వయస్సు, అర్హత కారణంగా ఇప్పటికే తమ ఖాతాను క్లోజ్ చేసిన వారు మళ్లీ తమ ఖాతాను తెరు,ఉకునే వెసులుబాటు కలగనుంది. ఇప్పటివరకు 65 సంవత్సరాల వయసు కలిగిన వారికి మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉండగా.. 65 ఏళ్లు పైబడిన వారు నేషనల్ పెన్షన్ స్కీమ్ పెట్టుబడి పెట్టడానికి అనుమతించింది. 70 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడులు పెట్టవచ్చు, ఆ తరువాత 75 సంవత్సరాల వయస్సు వరకు పొడిగించవచ్చు. విదేశాల్లో ఉంటున్న భారతీయ పౌరులు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్‌డీఏ) తాజా మార్గదర్శకాల ప్రకారం 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా ఇప్పుడు నేషనల్‌ పెన్షన్ స్కీమ్‌లో ఖాతా తెరవవచ్చు. తాజా నిర్ణయంతో ఉద్యోగ విరమణ తర్వాత పెట్టుబడి పెట్టాలనుకునే, ఉద్యోగ విరమణ చేయాలనుకునే సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కలగనుంది.

జాతీయ ఫించను పథకంలోఅకౌంట్‌ తెరిచిన వెంటనే ‘టైర్ 1’ ఖాతా ప్రారంభమవుతుంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈక్విటీ, రుణాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. 65 ఏళ్ల తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరిన వారు పీఎఫ్ లేదా అసెట్ అలకేషన్‌ను ఎంచుకోవచ్చు. ఆటో, యాక్టివ్ ఆప్షన్‌ల క్రింద వరుసగా 15 శాతం, 50 శాతం పెట్టుబడి పెట్టవచ్చు.

ఇప్పటివరకు నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి గరిష్ట వయస్సు 65 ఏళ్లు ఉండగా.. దీనిని 70 సంవత్సరాలకు పొడిగించడంతో.. పన్ను ఆదా విషయంలో, దీర్ఘకాలిక పెట్టుబడికి ఈ పథకం మంచి ఎంపిక. ఈ పెట్టుబడి నుంచి వచ్చే రాబడి కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పైనే ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..