AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సంవత్సరం జీతాలు, ఇంక్రిమెంట్లు పెరుగుతాయా..? కంపెనీలు ఏం చెబుతున్నాయి..! తెలుసుకోండి..

Salary Increment Likely in 2021 : కొవిడ్ -19 రెండో వేవ్‌ మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది కానీ 2021లో జీతాల పెంపుపై ప్రభావం చూపే

ఈ సంవత్సరం జీతాలు, ఇంక్రిమెంట్లు పెరుగుతాయా..?  కంపెనీలు ఏం చెబుతున్నాయి..! తెలుసుకోండి..
Salary Increment
uppula Raju
|

Updated on: Apr 14, 2021 | 8:17 PM

Share

Salary Increment Likely in 2021 : కొవిడ్ -19 రెండో వేవ్‌ మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది కానీ 2021లో జీతాల పెంపుపై ప్రభావం చూపే అవకాశం లేదు. 2021లో దేశంలోని చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వాలని భావిస్తున్నాయని తాజా సర్వే సూచించింది. ఈ సర్వేలో 59 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాల పెంపును ఇవ్వడంతో పాటు మొత్తం శ్రామిక శక్తిని బలోపేతం చేస్తాయని తేలింది. ఈ సర్వేను ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించగా 1,200 కంపెనీలు పాల్గొన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణం, ఇంజనీరింగ్, విద్య , బోధన, శిక్షణ, ఎఫ్‌ఎంసిజి, హాస్పిటాలిటీ, హెచ్‌ఆర్ సొల్యూషన్స్, ఐటి , ఐటిఇఎస్, బిపిఓ, లాజిస్టిక్స్, తయారీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, మెడికల్, పవర్ అండ్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్ , రిటైల్, టెలికాం కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి.

మెజారిటీ కంపెనీలు ఉద్యోగులకు జీతాల పెంపు ఇస్తామని సూచించాయి. సగటు ఇంక్రిమెంట్ పరిధి 5 నుంచి 10 శాతం మధ్య ఉంటుందని తెలిపాయి. కొంతమంది పైన పేర్కొన్న శాతం కంటే తక్కువగా ఉండవచ్చని సూచించారు. 2021 లో జీతం పెంపు ఐదు శాతం కంటే తక్కువగా ఉంటుందని 20 శాతం మంది చెప్పారు. అయితే 2121 మంది మాత్రం 2021 లో వేతనాల పెంపు ఉండదని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది కొత్త నియామకాలకు ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పగా, 11 శాతం మంది కొత్తగా నియమించుకునే అవకాశం లేదని చెప్పారు.

37 శాతం మంది నియామకంతో కొత్త మార్కెట్ అవకాశాల విషయంలో దక్షిణాది మార్కెట్ ముందుంటుందని, వెస్ట్రన్ జోన్ 33 శాతంతో ఉంటుందని సర్వే సూచించింది. కంపెనీలు తమ శ్రామిక శక్తిని బలోపేతం చేసే విధంగా ఆలోచన చేస్తున్నాయి. 21 శాతం మంది 15 శాతానికి పైగా పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా వుండగా సర్వే చేసిన కంపెనీలలో 26 శాతం జట్టు బలాన్ని 10-15 శాతం పెంచుతామని తెలిపారు. 30 శాతం మంది 10 శాతం పెంచుతామని, 23 శాతం మంది నియామకం ఉండదని స్పష్టం చేశారు. కేవలం నాలుగు శాతం మంది మాత్రమే 2021 లో తొలగింపులు ఉంటాయని సూచించారు.

SRH vs RCB Live Score IPL 2021: ఫేస్ టు ఫేస్.. సూపర్ ఫైట్.. హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. గెలిచేది మాత్రం..?

Trending: మాస్క్ గీస్క్ అక్కర్లే..ఈయన చెప్పినట్టు చేయండి చాలు..నెట్టింట్లో రచ్చ చేస్తున్న మహానుభావుడు!

ఏ.ఆర్‌.రెహ‌మాన్ ‘99 సాంగ్స్‌’..! ట్రైలర్‌పై స్పందించిన ప్రియాంక చోప్రా.. ఏం కామెంట్‌ చేసిందంటే..?