Infosys Jobs: ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్…క్యాంపస్ ఇంటర్వ్యూలతో భారీగా ఉద్యోగ నియామకాలు

Infosys Recruitments News: దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

Infosys Jobs: ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్...క్యాంపస్ ఇంటర్వ్యూలతో భారీగా ఉద్యోగ నియామకాలు
ప్రతీకాత్మక చిత్రం
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 14, 2021 | 7:04 PM

Infosys Jobs: దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 24 వేల నుంచి 26 వేల మంది కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకోబోతున్నట్లు ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు వెల్లడించారు. వీరిలో 24 వేల మందిని భారత్‌ నుంచి…మిగిలిన వారిని విదేశాల నుంచి రిక్రూట్ చేసుకోబోతున్నట్లు తెలిపారు. ముగిసిన ఆర్థిక సంవత్సరం (2020-21)తో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువ కావడం విశేషం. మార్చినెలాఖరుతో ముగిసిన ఆర్థిక మాసంలో భారత్‌లో 19 వేల మంది కొత్త ఉద్యోగులు, విదేశాల నుంచి 2 వేల మందిని ఇన్ఫోసిస్ రిక్రూట్ చేసుకుంది.

కొత్త అవకాశాలు, ఇతరత్ర కారణాలతో కంపెనీని వీడే ఉద్యోగుల సంఖ్య పెరిగినా…నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కంపెనీలో కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రవీణ్ రావు తెలిపారు. కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా గత ఏడాది తమ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ జీతాలు పెంచలేదు. కాస్త ఆలస్యంగా మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా జనవరి మాసంలో జీతాల పెంపు ప్రకటించారు. ఉద్యోగుల్లో నైపుణ్యతను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది జులై మాసంలో రెండోసారి ఫర్ఫార్మెన్స్ రివ్యూ చేపట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరపు చివరినాటికి ఇన్ఫోసిస్ సంస్థలో 2,59,619 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 40 వేల నియామకాలు చేపట్టనున్నట్లు మరో ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్(TCS) ఇప్పటికే ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ 40 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టింది. కాగా టీసీఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య మరో మూడు మాసాల్లో 5 లక్షల మార్క్‌కు చేరుకోనుంది.

ఇవి కూడా చదవండి..సరికొత్త రికార్డుకు చేరువలో TCS…అత్యధిక ఉద్యోగులు పనిచేస్తున్న ఐటీ కంపెనీలు ఇవే..!

నెలకు పదివేలు కడితే చాలు.. కొత్త మారుతీ కారు మీ సొంతం చేసుకోవచ్చు.. ఎలాగంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!