AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Swift: నెలకు పదివేలు కడితే చాలు.. కొత్త మారుతీ కారు మీ సొంతం చేసుకోవచ్చు.. ఎలాగంటే..

ఇండియాలో కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేసులో నిలిచే బ్రాండ్ మారుతి స్విఫ్ట్! మారుతీ సుజుకీ ఈ స్విఫ్ట్ మోడల్ ను పదిహేనేళ్ల క్రితం లాంచ్ చేసింది.

Maruti Swift: నెలకు పదివేలు కడితే చాలు.. కొత్త మారుతీ కారు మీ సొంతం చేసుకోవచ్చు.. ఎలాగంటే..
Maruti Swift Facelift
KVD Varma
|

Updated on: Apr 14, 2021 | 5:49 PM

Share

Maruti Swift: ఇండియాలో కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేసులో నిలిచే బ్రాండ్ మారుతి స్విఫ్ట్! మారుతీ సుజుకీ ఈ స్విఫ్ట్ మోడల్ ను పదిహేనేళ్ల క్రితం లాంచ్ చేసింది. ఈ మోడల్ మార్కెట్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాని క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ టాప్ సేల్స్ ను ఈ మోడల్ కొల్లగొడుతోంది. స్విఫ్ట్ కారును ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉంచే ప్రయత్నం చేస్తూ వస్తోంది మారుతి. అందులో భాగంగా మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ ను ఫిబ్రవరి నెలలో విడుదల చేసింది. స్విఫ్ట్ కి కొన్ని అప్ డేషన్స్ తో ఈ మోడల్ విడుదల చేసింది మారుతి. ఇది కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్-జెన్ కె-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్-వివిటి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది.

ఈ కారు ప్రత్యేకతలు చూస్తే..

  • 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మధ్యలో బోల్డ్ హారిజాంటల్ క్రోమ్ తో సరికొత్త మెష్ గ్రిల్‌ను కలిగి ఉంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్ దీనికి అమర్చారు.
  • 15-అంగుళాల ప్రెసిషన్-కట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
  • ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు అవుట్‌గోయింగ్ మోడల్ కంటే బాగా వున్నాయి.
  • 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్లను కొత్త స్విఫ్ట్‌లోనూ వాడారు.
  • మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఎంటి 23.20 కిలోమీటర్లు, 2021 స్విఫ్ట్ ఎఎమ్‌టి 23.76 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని పేర్కొంది.

ఈ కారు ధర చూస్తే..

దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ రూ.8.41 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తుంది. అయితే ఈ కారును ఫైనాన్స్ లో ఈఎంఐ రూపంలోనూ తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ కారు ఫైనాన్స్ విషయానికి వస్తే కనిస్టంగా రూ.1,28,759 డౌన్ పేమెంట్ చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్లో బ్యాంకులు అత్యల్పంగా 7 నుంచి 9 శాతం మధ్యలో కార్ల వడ్డీ రేట్లతో లోన్లను అందిస్తున్నారు. ఈ లెక్కన 5 సంవత్సరాల కాల వ్యవధికి సుమారు రూ.10 వేల వరకూ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: సరికొత్త రికార్డుకు చేరువలో TCS…అత్యధిక ఉద్యోగులు పనిచేస్తున్న ఐటీ కంపెనీలు ఇవే..!

Corona in Tollywood: టాలీవుడ్‌లో కరోనా టెన్షన్.. పలువురు సెలబ్రిటీలకు పాజిటివ్.. తాజా రిపోర్ట్ ఇది

Follow Us
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..