త్వరలోనే టీఎస్​పీఎస్సీ పాలకవర్గం ఏర్పాటు..! సభ్యులుగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయంటే..?

TSPSC Governing Body :  తెలంగాణ ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతున్న వేళ టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లో సభ్యులు లేకపోవడంతో

త్వరలోనే  టీఎస్​పీఎస్సీ పాలకవర్గం ఏర్పాటు..! సభ్యులుగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయంటే..?
Follow us
uppula Raju

|

Updated on: Apr 15, 2021 | 3:39 PM

TSPSC Governing Body :  తెలంగాణ ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతున్న వేళ టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లో సభ్యులు లేకపోవడంతో నియామకాలపై సందిగ్ధత ఏర్పడే అవకాశముంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఉద్యోగ ప్రకటనలు వెలువడాలంటే చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యులు తప్పకుండా ఉండాలి. వారి ఆమోదంతోనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా నిబంధనలున్నాయి. కానీ, ప్రస్తుతం ఒక్కరు మాత్రమే ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే శాఖలవారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఒకే ఒక్కడితో ఉన్న టీఎస్​పీఎస్సీకి ఈ నెలలోనే చైర్మన్​తో పాటు నలుగురు సభ్యులను నియమించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాబితాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. చైర్మన్ పదవికి ఉన్న పరిమితులు, వచ్చే విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ రిటైర్డ్​ ఐపీఎస్​ అధికారి పేరు ప్రస్తావనకు వచ్చినా… చాలా కీలక విభాగాల్లో ఐపీఎస్​ అధికారులను నియమిస్తున్నారనే విమర్శలున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత టీఎస్​పీఎస్సీకి ప్రొఫెసర్​ ఘంటా చక్రపాణి ఛైర్మన్​గా, ఉద్యోగ సంఘాల నేత విఠల్​తో పాటు చంద్రావతి, మతీనుద్దీన్​ ఖాద్రీ, వివేక్, కృష్ణారెడ్డి, రామ్మోహన్​రెడ్డి, రాజేందర్, విద్యాసాగర్​రావు, సాయిలు, మన్మధరెడ్డిలను సభ్యులుగా నియమించారు.కాగా వారందరి పదవీకాలం ముగిసింది. సాయిలు ఒక్కడే సభ్యుడుగా ఉండటంతో ఆయనే యాక్టింగ్​ ఛైర్మన్​గా, సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడే కమిటీలో ఛైర్మన్​ అంశాన్ని మినహాయిస్తే… సభ్యులుగా ఉద్యోగ సంఘాల నుంచి కారం రవీందర్​రెడ్డి, డాక్టర్​ గండూరి వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టీఎస్​పీఎస్సీలో అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేస్తున్న గండూరి వెంకటేశ్వర్లు కూడా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈసారి ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరికి అవకాశం వస్తుందా అనే ప్రచారం కూడా జరుగుతోంది.

Gold and Silver Price: ఓవైపు కరోనా విజృంభన.. మరోవైపు పసిడి, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు.. ఎంతమేర పెరిగాయంటే

విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ.. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్‌‌ నిర్వహణపై చర్చ..!

Viral News: ఇంట్లోని ఓ గుంతలో భారీ సంఖ్యలో గుడ్లు పెట్టిన పాము.. దాని పిల్లలను నీటిలో వదిలిపెట్టిన అధికారులు