విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ.. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్‌‌ నిర్వహణపై చర్చ..!

తెలంగాణలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మరి కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.

విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ.. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్‌‌ నిర్వహణపై చర్చ..!
Sabhita Insrareddy
Follow us

|

Updated on: Apr 15, 2021 | 3:17 PM

Sabhita Indrareddy Review: తెలంగాణలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మరి కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో పరీక్షల వాయిదాపై సమాలోచనలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. టెన్త్‌, ఇంటర్ పరీక్షల నిర్వహణపై చర్చిస్తోంది.. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది…? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

కాగా, ఇప్పటికే కేంద్రం సీబీఎస్‌ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా.. నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోవిడ్‌ విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు వెళ్లి ఎగ్జామ్స్‌ రాయడమనేది కత్తిమీద సామే. అసలే ఆన్‌లైన్‌ క్లాసులు అర్థంకాక సతమతమవుతున్న స్టూడెంట్స్‌.. కరోనా పీక్స్‌కు చేరిన ఈ సమయంలో.. ఎగ్జామ్స్‌ ఎలా రాయాలా అని ఆందోళన చెందుతున్నారు.

సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో టెన్త్​బోర్డు ఎగ్జామ్స్​తో పాటు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని యోచిస్తోంది. సెకండియర్ ఎగ్జామ్స్ మాత్రం మరి కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తోంది. విద్యా శాఖ అధికారులు ఎగ్జామ్స్​పై నిర్వహించే సమీక్ష కీలకంగా మారింది.

రాష్ట్రంలో టెన్త్ స్టూడెంట్లు 5.2 లక్షల మంది, ఫస్టియర్ స్టూడెంట్లు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు. ఇంటర్ స్టూడెంట్లకు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో, పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. దీంతోనే మార్చి 24 నుంచి విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది. ఫస్టియర్ విద్యార్థులకు ఈనెల1న జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఈనెల 3న జరగాల్సిన ఎన్విరాన్​మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఇంటి నుంచి రాసి పంపించే అవకాశమిచ్చింది. ఈనెల 7 నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ మే 29 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ప్రకటించింది. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉంటాయా లేదా అనే దానిపై స్టూడెంట్లు, పేరెంట్స్​లో ఆందోళన మొదలైంది.

కరోనా కేసులు పెరుగుతుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపైనా నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. దీనివల్ల పిల్లల్లో టెన్షన్ తగ్గుతుందని యోచిస్తోంది.

ఇదిలావుంటే, ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, సెకండియర్​మార్కులతో పలు నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌కు లింక్ ఉండటంతో, కాస్త లేటైనా వారికి పరీక్షలు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ్టి మంత్రి సబితా సమీక్ష రిపోర్టును సర్కారుకు పంపిస్తే.. సీఎం కేసీఆర్​నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Read Also… Delhi COVID-19 news: ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. మాల్స్​, జిమ్​లు క్లోజ్.. మరిన్ని ఆంక్షలు