RBI Update: ఈ బ్యాంకుకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. రూ.2 కోట్ల జరిమానా!

బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంక్ యూసీఓ (UCO) బ్యాంక్‌పై పెద్ద చర్య తీసుకుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, దాని సూచనలను పాటించనందున ఆర్బీఐ యూసీవో బ్యాంక్‌పై రూ. 2,68,30,000 జరిమానా విధించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 26, 2024న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, UCO బ్యాంక్‌పై..

RBI Update: ఈ బ్యాంకుకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. రూ.2 కోట్ల జరిమానా!
Rbi
Follow us

|

Updated on: Aug 30, 2024 | 8:58 PM

బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంక్ యూసీఓ (UCO) బ్యాంక్‌పై పెద్ద చర్య తీసుకుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, దాని సూచనలను పాటించనందున ఆర్బీఐ యూసీవో బ్యాంక్‌పై రూ. 2,68,30,000 జరిమానా విధించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 26, 2024న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, UCO బ్యాంక్‌పై రూ. 2,68,30,000 జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. యూసీవో బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 26A నిబంధనలను ఉల్లంఘించినందుకు అడ్వాన్స్‌లపై వడ్డీ రేట్లు, బ్యాంక్ కరెంట్ ఖాతాలలో క్రమశిక్షణ, డిపాజిట్లపై వడ్డీ రేట్లు, మోసం, వాణిజ్య బ్యాంకుల రిపోర్టింగ్, తదితర కారణాల వల్ల ఈ జరిమానా విధించింది. ఆర్థిక సంస్థలు డిపార్ట్‌మెంట్ జారీ చేసిన సూచనలను పాటించనందున ఈ చర్య తీసుకుంది. యూకో బ్యాంకుకు ఇచ్చిన అధికారాల ప్రకారం ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఇది కూడా చదవండి: Ambani House: అంబానీ ఇంటి నిర్మాణానికి ఎన్నేళ్లు పట్టింది? ఖర్చు ఎంత? ఇంటి ప్రత్యేకతలు ఏంటి?

బ్యాంకు పర్యవేక్షక విచారణ అనంతరం దానికి నోటీసు కూడా జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. దీనిపై గరిష్ఠ జరిమానా ఎందుకు విధించకూడదని బ్యాంకుకు పంపిన నోటీసులో ప్రశ్నించింది. నోటీసుకు బ్యాంక్ ప్రతిస్పందన తర్వాత, పెనాల్టీ వేసింది. ఆ తర్వాత యూసీవో బ్యాంక్‌పై ద్రవ్య పెనాల్టీ విధించింది.

ఇవి కూడా చదవండి

యూసీవో బ్యాంక్ తన ఫ్లోటింగ్ రేట్ వ్యక్తిగత రిటైల్ రుణాలు, బాహ్య బెంచ్‌మార్క్‌లతో MSMEలకు ఇచ్చిన రుణాలను బెంచ్‌మార్క్ చేయడంలో విఫలమైందని ఆర్బీఐ గుర్తించింది. అయితే ద్రవ్య పెనాల్టీ విధించడం వల్ల బ్యాంకుపై చేపట్టే ఇతర చర్యలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆర్‌బీఐ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Android 15: ఆండ్రాయిడ్‌ 15 స్మార్ట్‌ ఫోన్‌ ఎప్పుడు వస్తుందో తెలుసా? గూగుల్‌ కీలక ప్రకటన

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
మంచు ఫ్యామిలీ మూడో తరం "తిన్నడు".! మంచు అవ్రామ్‌ పోస్టర్‌ లుక్‌..
మంచు ఫ్యామిలీ మూడో తరం
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!