Android 15: ఆండ్రాయిడ్‌ 15 స్మార్ట్‌ ఫోన్‌ ఎప్పుడు వస్తుందో తెలుసా? గూగుల్‌ కీలక ప్రకటన

గూగుల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 9 సిరీస్‌ను ఇటీవల విడుదల చేసింది. ఫోన్‌తో పాటు ఆండ్రాయిడ్ 15ను గూగుల్ విడుదల కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ 15కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పలు ఫీచర్లతో త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వెలువడుతున్న సమాచారం మేరకు.. గూగుల్‌ ఈ కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గూగుల్ ఈ సమాచారాన్ని..

Android 15: ఆండ్రాయిడ్‌ 15 స్మార్ట్‌ ఫోన్‌ ఎప్పుడు వస్తుందో తెలుసా? గూగుల్‌ కీలక ప్రకటన
Android 15
Follow us
Subhash Goud

|

Updated on: Aug 30, 2024 | 7:57 PM

గూగుల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 9 సిరీస్‌ను ఇటీవల విడుదల చేసింది. ఫోన్‌తో పాటు ఆండ్రాయిడ్ 15ను గూగుల్ విడుదల కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ 15కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పలు ఫీచర్లతో త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వెలువడుతున్న సమాచారం మేరకు.. గూగుల్‌ ఈ కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ను అక్టోబర్ 2024లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గూగుల్ ఈ సమాచారాన్ని విడుదల నోట్ ద్వారా అందించింది. అయితే అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేసే తేదీ మాత్రం క‌న్ఫ‌ర్మ్ చేయలేదు. అయితే గూగుల్ ఆండ్రాయిడ్ 15ను అక్టోబర్ మధ్యలో విడుదల చేయవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.

ఈ ఫోన్‌లలో అప్‌డేట్‌:

కొత్త ఆండ్రాయిడ్ రోల్‌అవుట్‌తో ఇది ముందుగా Google పిక్సెల్‌లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. OnePlus, Samsung, ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు మరికొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. ఇది కాకుండా, ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌లో చాలా కొత్త ఫీచర్లు కూడా అందించే అవకాశాలు ఉన్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

బ్యాటరీ హెల్త్‌ శాతం, సున్నితమైన యాప్‌లను దాచడానికి ప్రత్యేక స్థలం, లాక్-స్క్రీన్ విడ్జెట్, బ్లూటూత్ ఆరాకాస్ట్‌కు మద్దతు, మరెన్నో వంటి అనేక గొప్ప ఫీచర్లతో ఈ వెర్షన్‌ను ఉంటుందని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఆండ్రాయిడ్ వినియోగదారులు చాలా కాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను పొందబోతున్నారు. ఈ అప్‌డేట్ కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే విధానం కూడా మారుతుంది.

ఇది కూడా చదవండి: Ambani House: అంబానీ ఇంటి నిర్మాణానికి ఎన్నేళ్లు పట్టింది? ఖర్చు ఎంత? ఇంటి ప్రత్యేకతలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి