Youtube: యూట్యూబ్‌ లవర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన ధరలు

ఈ క్రమంలోనే యూట్యూబ్ మరింత అడ్వాన్స్‌ సేవలను అందించే క్రమంలో యూట్యూబ్ ప్రీమియం పేరుతో సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌తో పాటు, ఎక్కువ క్లారిటీతో కూడిన వీడియోలను వీక్షించే అవకాశం కల్పించారు. అలాగే ఎలాంటి ప్రకటనలు లేకుండా వీడియోలను వీక్షించే అవకాశం కూడా ఈ యూట్యూబ్...

Youtube: యూట్యూబ్‌ లవర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన ధరలు
Youtube
Follow us

|

Updated on: Aug 31, 2024 | 8:22 AM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ క్షణం వేల సంఖ్యలో కొత్త వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ మొదలు వార్తల వరకు అన్నింటికీ సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో చూడొచ్చు. ఇక యూట్యూబ్‌తో క్రియేటర్లు కూడా బాగా లాభపడుతున్నారు. తమ క్రియేటివితో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.

ఈ క్రమంలోనే యూట్యూబ్ మరింత అడ్వాన్స్‌ సేవలను అందించే క్రమంలో యూట్యూబ్ ప్రీమియం పేరుతో సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌తో పాటు, ఎక్కువ క్లారిటీతో కూడిన వీడియోలను వీక్షించే అవకాశం కల్పించారు. అలాగే ఎలాంటి ప్రకటనలు లేకుండా వీడియోలను వీక్షించే అవకాశం కూడా ఈ యూట్యూబ్ ప్రీమియం ద్వారా లభిస్తుంది. అయితే ఈ ప్రీమియం సేవలను ఉపయోగిస్తున్న వారికి యూట్యూబ్‌ తాజాగా షాకింగ్ న్యూస్‌ చెప్పింది. ప్రీమియం ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

యూట్యూబ్ ప్రీమియం ఛార్జీలను గరిష్టంగా ఒకేసారి ఏకంగా రూ. 200 వరకు పెంచడం గమనార్హం. సుమారు 58 శాతం ధరలు పెరిగాయి. ప్రస్తుతం యూట్యూబీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను నెలవారీ, 3 నెలలు, 12 నెలల ప్లాన్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పెరిగిన ధరల వివరాల్లోకి వెళ్తే.. నెలవారీ ప్లాన్ ధర రూ.129 నుంచి రూ.149కి పెరిగింది. అదే సమయంలో విద్యార్థి నెలవారీ ప్లాన్ ధర రూ.79 నుంచి రూ.89కి పెరిగింది.

ఇక ఫ్యామిలీ మంత్లీ ప్లాన్ ధరను యూట్యూబ్‌ రూ.189 నుంచి రూ.299కి పెంచింది. వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారీ ప్లాన్ ధర రూ.139 నుంచి రూ.159కి పెరిగింది. ఇది కాకుండా 3 నెలల ప్లాన్ ధర రూ.399 నుంచి రూ.459కి పెరిగింది. వార్షిక ప్లాన్‌ల ధరలను కూడా పెంచారు. ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ తీసుకున్న యూజర్లు ఎలాంటి యాడ్స్ లేకుండా వీడియోలను చూసే అవకాశం లభిస్తోంది. అలాగే వీడియోలను హై డెఫినేషన్‌లో కూడా చూసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
మంచు ఫ్యామిలీ మూడో తరం "తిన్నడు".! మంచు అవ్రామ్‌ పోస్టర్‌ లుక్‌..
మంచు ఫ్యామిలీ మూడో తరం
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!