Fine to SBI: ఎస్బీఐకి షాకిచ్చిన రిజర్వ్ బ్యాంక్.. ఏకంగా ఎంత ఫైన్ వేసిందంటే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సోమవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పై కోటి రూపాయల జరిమానా విధించింది. రెగ్యులేటరీ పాటించడంలో లోపాల కోసం ఈ జరిమానాలు విధించారు.
Fine to SBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సోమవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పై కోటి రూపాయల జరిమానా విధించింది. రెగ్యులేటరీ పాటించడంలో లోపాల కోసం ఈ జరిమానాలు విధించారు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A (1) (c), 46 (4) (i) మరియు 51 (1) నిబంధనల ప్రకారం RBI కి ఉన్న అధికారాలను అమలు చేస్తూ జరిమానా విధిస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది.
SBI ఈ నియమాలను ఉల్లంఘించింది..
రిజర్వ్ బ్యాంక్ తన పత్రికా ప్రకటనలో 2016 ఆర్బీఐ(RBI) (వాణిజ్య బ్యాంకుల ద్వారా మోసాల వర్గీకరణ.. రిపోర్టింగ్ మరియు సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్) ఆదేశాలని ఎస్బీఐ(SBI) పాటించలేదు. ఎస్బీఐ కస్టమర్లతో మోసాలను వర్గీకరించడానికి.. నివేదించడానికి నియమాలను ఉల్లంఘించింది.
SBI కి నోటీసు జారీ..
విచారణ తర్వాత, RBI ఈ విషయానికి సంబంధించి బ్యాంకుకు నోటీసు జారీ చేసింది. నోటీసులో, సూచనలను పాటించనందుకు ఎస్బీఐకి ఎందుకు జరిమానా విధించకూడదు అని అడిగారు. ఆర్‌బిఐ నోటీసుకు బ్యాంక్ ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత, వ్యక్తిగత విచారణ ప్రతిస్పందనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, పెనాల్టీ విధించాలని ఆర్‌బిఐ నిర్ణయించింది.
కుర్లా నగ్రిక్ సహకరి బ్యాంకుకు కూడా గురువారం ఉదయం జరిమానా విధించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు ముంబైలోని కుర్లా నగ్రిక్ సహకరి బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) లక్ష రూపాయల జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47 A (1) (c), సెక్షన్ 46 (4) (i) ,సెక్షన్ 56 కింద RBI ఈ జరిమానా విధించింది.
ఇవి కూడా చదవండి: TATA Punch: భద్రతా ప్రమాణాలలో టాటా మోటార్స్ కార్లు టాప్.. 5 స్టార్ రేటింగ్ తో వస్తున్న టాటా పంచ్!
Pre Install Apps: మీకు తెలుసా? స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లతో మన డాటా చోరీ అయిపోతోంది!