- Telugu News Photo Gallery Business photos Mahindra Diwali Offers: festive offers grab savings of up to rs 81500 on select mahindra cars
Mahindra Diwali Offers: పండగ సీజన్‌లో బంపర్ ఆఫర్.. కొత్త కారు కొనేవారికి భారీ తగ్గింపు, క్యాష్‌బ్యాక్..!
Mahindra Diwali Offers: కొత్త కారు కొనుగోలు చేసేవారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. పండగ సీజన్‌లో భాగంగా భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ వాహన..
Updated on: Oct 18, 2021 | 9:41 PM

Mahindra Diwali Offers: కొత్త కారు కొనుగోలు చేసేవారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. పండగ సీజన్‌లో భాగంగా భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా కార్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కేయూవీ100 ఎన్ఎక్స్‌టీ మోడల్‌పై రూ.41,055 తగ్గింపు బెనిఫిట్స్ పొందవచ్చు.

క్యాష్ డిస్కౌంట్ రూ.38 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేల వరకు ఉంది. బొలెరో కారుపై రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే స్కార్పియో వాహనంపై రూ.22,320 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

ఇందులో ఎక్స్చేంజ్ బోనస్ రూ.5 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4 వేలు, అదనపు ఆఫర్లు రూ.13,320 కలిసి ఉన్నాయి. ఎక్స్‌యూవీ 300 కారుపై రూ.44 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ ఆఫర్‌లో భాగంగా క్యాష్ డిస్కౌంట్ రూ.15 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4 వేలు, అదనపు తగ్గింపు రూ.5 వేలు వంటివి ప్రయోజనాలు ఉన్నాయి. ఇక అల్టురాస్ జీ4 కారుపై రూ.81,500 తగ్గింపు ఉంది.

ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.50 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.11,500 వరకు ఉంది. అదనపు ఆఫర్ల కింద రూ.20 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.





























