- Telugu News Photo Gallery Business photos Rs 9.34 lakh per minute! This is how much 1 Indian company earns every 60 seconds
Indian Companies: భారత్‌లో ఈ కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో తెలిస్తే షాకవుతారు..!
Indian Companies: మన దేశంలో దిగ్గజ కంపెనీలు గంటకు ఎంత సంపాదిస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇటీవల ఆయా కంపెనీలు, ప్రమఖ ఆదాయాలపై సర్వే నిర్వహించే ఫైన్ షాట్స్ ..
Updated on: Oct 19, 2021 | 7:05 PM

Indian Companies: మన దేశంలో దిగ్గజ కంపెనీలు గంటకు ఎంత సంపాదిస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇటీవల ఆయా కంపెనీలు, ప్రమఖ ఆదాయాలపై సర్వే నిర్వహించే ఫైన్ షాట్స్ సంస్థ.. మనదేశంలో ఉన్న బడా కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో సర్వే ద్వారా తేల్చింది. పలు కంపెనీలు నిమిషానికి సుమారుగా రూ.10 లక్షలు సంపాదించడం గమనార్హం.

ప్రముఖ కంపెనీలైన భారత్ పెట్రోలియం నిమిషానికి రూ.3.7 లక్షలు సంపాదిస్తోంది. అలాగే ఓఎన్‌జీసీ నిమిషానికి రూ.3.9 లక్షలు సంపాదిస్తుండగా, ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు నిమిషానికి రూ.3.9 లక్షలను సంపాదిస్తోంది.

ఇక హెచ్‌డీఎఫ్‌సీ నిమిషానికి రూ.3.56 లక్షలు, ఇన్ఫోసిస్ నిమిషానికి రూ.3.68 లక్షలు, ఇండియన్ ఆయిల్ కంపెనీ నిమిషానికి రూ.4.14 లక్షల సంపాదన ఉంది.

ఇక దేశీయ అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిమిషానికి రూ.4.24 లక్షలు సంపాదిస్తోందని సర్వేలో తేలింది. టీసీఎస్ కంపెనీ నిమిషానికి రూ.6.17లక్షలు సంపాదిస్తుండగా, రిలయన్స్ సంస్థ నిమిషానికి రూ.9.34 లక్షుల ఆర్జిస్తోంది. ఈ కంపెనీ ప్రథమ స్థానంలో ఉంది.





























