SBI Savings Account: మీకు ఎస్‌బీఐ అకౌంట్ కావాలా..? బ్యాంకుకు వెళ్లకుండానే తీసుకోవచ్చు.. ఎలాగంటే..!
SBI Savings Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. 22,000 పైగా బ్రాంచ్‌లతో 45 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలను..
SBI Savings Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. 22,000 పైగా బ్రాంచ్‌లతో 45 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలను అందిస్తోంది. టెక్నాలజీని ఉపయోగించుకొని డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది ఎస్‌బీఐ. కస్టమర్లకు ఆన్‌లైన్‌లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఎస్‌బీఐ కస్టమర్లు కేవలం కొన్ని సులభమైన స్టెప్స్‌తో ఆన్‌లైన్‌లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లోనే కేవైసీ ప్రాసెస్ జరుగుతుంది. అయితే కస్టమర్లు కేవైసీ వెరిఫికేషన్ కోసం ఒక్కసారి మాత్రమే బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మరి మీరు ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలో తెలుసుకోండి.
► ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వెబ్‌సైట్ https://sbi.co.in/ ఓపెన్ చేయండి.
► హోమ్ పేజీలో Accounts సెక్షన్‌లో Savings Bank Account పైన క్లిక్ చేయాలి.
► కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అకౌంట్ వివరాలు ఉంటాయి.
► ఖాతాకు సంబంధించిన వివరాలు చెక్ చేసిన తర్వాత Apply Now పైన క్లిక్ చేయాలి.
► కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Apply Now పైన క్లిక్ చేయాలి.
► మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.
► మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
► ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాలి.
► ఆ తర్వాత పేజీలో మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
► మీ వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
► మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకు నుంచి మీకు కాల్ వస్తుంది.
► బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి.
► బ్యాంకులో కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
► వెరిఫికేషన్ పూర్తయిన 3 నుంచి 5 రోజుల్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
ఖాతా ఓపెన్ చేయడానికి కావాల్సిన అర్హతలు..
ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కొన్ని అర్హతలు తప్పనిసరి. అకౌంట్ ఓపెన్ చేసే వ్యక్తి భారతీయ పౌరులై ఉండాలి. వయస్సు 18 ఏళ్ల పైనే ఉండాలి. ఒకవేళ మైనర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలంటే తల్లిదండ్రులు, లేదా సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేయాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సమర్పించడం తప్పనిసరి. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. ఆన్‌లైన్‌లో అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కసారి అది కూడా కేవైసీ వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు వెళ్తే చాలు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. మీ అకౌంట్‌ను జీరో బ్యాలెన్స్ సాలరీ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. ఆన్‌లైన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి. ప్రతీ నెలా స్టేట్‌మెంట్స్ ఇ-మెయిల్ ద్వారా స్టేట్‌మెంట్స్ లభిస్తాయి. డెబిట్ కార్డు కూడా లభిస్తుంది.