RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం..! పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గిస్తుందా.. పెంచుతుందా..?
RBI: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ ముఖ్యమైన సమావేశం అక్టోబర్‌లో జరిగింది. RBI MPC(monetary policy statement) నోట్ గత వారం జారీ చేశారు.
RBI: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ ముఖ్యమైన సమావేశం అక్టోబర్‌లో జరిగింది. RBI MPC(monetary policy statement) నోట్ గత వారం జారీ చేశారు. దీని ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌తో సహా అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును తగ్గించాలని సూచించింది. RBI లెక్కల ప్రకారం.. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి PPF వడ్డీ రేటు 6.63 శాతంగా ఉండాలి. ప్రస్తుతం పీపీఎఫ్‌పై వడ్డీ రేటు7.10 శాతంగా ఉంది. గత ఆరు త్రైమాసికాల్లో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. దీని కారణంగా ప్రభుత్వం 47-178 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని చెల్లిస్తోంది. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం ప్రస్తుతం నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్‌పై వడ్డీ రేటు 6.14 శాతం ఉండాలి కానీ ప్రస్తుతం 6.80 శాతంగా ఉంది.
PPF పై వడ్డీ రేటు 6.63 శాతం RBI డేటా ప్రకారం.. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి PPF వడ్డీ రేటు 6.63 శాతంగా ఉండాలి, ఇది ఇప్పుడు 7.10 శాతంగా ఉంది. 1-సంవత్సర కాల డిపాజిట్లకు వడ్డీ రేటు 3.72 శాతం ఉండాలి. కానీ 5.50 శాతంగా ఉంది. ఇది 1.78 శాతం ఎక్కువ. 2 సంవత్సరాలకు వడ్డీ రేటు 4.23 శాతం, 3 సంవత్సరాలకు వడ్డీ రేటు 4.74 శాతం, 5 సంవత్సరాలకు వడ్డీ రేటు 6.01 శాతం ఉండాలి. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు 5.50 శాతం, 6.70 శాతంగా ఉంది. ఆర్‌బిఐ లెక్క ప్రకారం ఇది వరుసగా 1.27 శాతం, 0.76 శాతం 0.69 శాతం ఎక్కువ.
రికరింగ్ డిపాజిట్లపై 1.06 శాతం ఎక్కువ వడ్డీ రికరింగ్ డిపాజిట్‌లకు వడ్డీ రేటు 4.74 శాతం అంటే 5.80 శాతం ఉండాలి. ఇది 1.06 శాతం ఎక్కువ. నెలవారీ ఆదాయ పథకానికి వడ్డీ రేటు 5.98 శాతం అంటే 6.60 శాతం ఉండాలి. ఇది 0.62 శాతం ఎక్కువ. కిసాన్ వికాస్ పత్రానికి వడ్డీ రేటు 6.38 శాతం అంటే ప్రస్తుతం 6.90 శాతంగా ఉండాలి. ఇది 0.52 శాతం ఎక్కువ. సుకన్య సమృద్ధి యోజన కోసం వడ్డీ రేటు 7.13 శాతం అంటే 7.60 శాతం ఉండాలి. ఇది 0.47 శాతం ఎక్కువ.