AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నెటిజన్ల మనసు దోచుకుంటున్న చిన్నారి సెల్యూట్‌.. వీడియో చూస్తే శభాష్‌ అంటారు..

Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో పిల్లల వీడియోలు కూడా ఉంటాయి. చిన్న వయసులో

Viral Video: నెటిజన్ల మనసు దోచుకుంటున్న చిన్నారి సెల్యూట్‌.. వీడియో చూస్తే శభాష్‌ అంటారు..
Kid Salutes
uppula Raju
|

Updated on: Oct 25, 2021 | 12:54 PM

Share

Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో పిల్లల వీడియోలు కూడా ఉంటాయి. చిన్న వయసులో వారు చేసే అల్లరి పనులను అందరు ఇష్టంగా చూస్తారు. ఎంతో అభిమానిస్తారు. లైక్స్, కామెంట్స్‌ చేస్తారు. అంతేకాదు కొంతమంది పిల్లల వీడియోలు చాలామందిని ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా బెంగుళూరు విమానాశ్రయంలో ఒక పిల్లవాడు చేసిన పనిని అందరు మెచ్చుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగుళూరు విమానాశ్రయంలో ఒక పిల్లవాడు వాహనంలో నిలబడి ఉన్న ఒక సెక్యూరిటీ ఆఫీసర్‌కి సెల్యూట్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. వాహనం నెమ్మదిగా కదులుతూ ముందుకు వస్తుంది. అప్పుడు తండ్రితో పాటు వెళుతున్న చిన్నారి వాహనాన్ని అందులో ఉన్న సెక్యురిటీ ఆఫీసర్‌ని చూస్తాడు. వెంటనే వాహనానికి ఎదురుగా నిలబడి సెల్యూట్‌ చేయడం మనం వీడియోలో తిలకించవచ్చు. అప్పుడు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ తిరిగి పిల్లవాడికి సెల్యూట్‌ చేస్తాడు. ఈ సన్నివేశం అందరి మనసులను కదిలించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నెటిజన్లు ఈ వీడియో చూసి పిల్లవాడని అభినందించలేకుండా ఉండలేకపోతున్నారు. ఇంత చిన్న వయసులో దేశం అంటే ఎంత అభిమానమని పొగుడుతున్నారు. ఈ రోజు ఇంటర్నెట్లో ఇదే అందమైన వీడియో అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ట్విట్టర్ యూజర్ అభిషేక్ కుమార్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను అతడు అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, మనోజ్ ముంతాషిర్‌లకు ట్యాగ్‌ చేయడం విశేషం. వీడియో చేసిన నెటిజన్లు పిల్లవాడిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Viral Video: ఇష్టంగా కష్టపడితే ఏదైనా దక్కాల్సిందే.. ఈ కుక్కపిల్లలు చేసిన పనికి ఫిదా కావాల్సిందే.!

Chandrababu Naidu Delhi Tour: రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న చంద్రబాబు….

Pak vs Ind: “వాదనలు” చేశారు.. మధ్యలోనే వెళ్లిపోయారు.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..