Chandrababu Naidu Delhi Tour: రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న చంద్రబాబు….
ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు మరికొందరు నేతలు దిల్లీకి బయలు దేరిన సంగతి తెలిసిందే.
ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు మరికొందరు నేతలు దిల్లీకి బయలు దేరిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులు, తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు, నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, డ్రగ్స్ మాఫియా తదితర అంశాలను ఆయన కేంద్ర పెద్దలకు వివరించనున్నారు. ఇక ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్రపతికి లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు నేరుగా రామ్‌నాథ్ కొవింద్‌ను కలిసి ఫిర్యాదుచేయనున్నారు. ఈమేరకు టీడీపీ నేతల బృందానికి సోమవారం మధ్యాహ్నం 12.30 రాష్ట్రపతి భవన్ అపాయింట్‌మెంట్ ఇచ్చింది.
ఈ పర్యటనలో అచ్చెన్నాయుడు, కేశినేని నాని, కాలువ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడుతో మొత్తం మొత్తం 18మంది నేతలు చంద్రబాబు వెంట ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రపతిని కలిసే ముందు చంద్రబాబు బృందం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఇంట్లో సమావేశమైంది. ఈ మేరకు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాల్సిన అంశాలపై చంద్రబాబు మరోసారి తన పార్టీ నేతలతో చర్చించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
Also Read: